బ్రెయిన్ క్లాట్ అంటే ఏమిటి..? ఇది ప్రాణాంతకమా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వెల్లడించారు. ఈ సమస్యను "బ్రెయిన్ క్లాట్" అంటారు అంటే మెదడులో రక్తం గడ్డకట్టడం. ఇది ఎందుకు జరుగుతుంది..?అసలు మెదడు గడ్డకట్టడానికి గల కారణాలు ఏమిటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

 

వినోద్ కాంబ్లీ మెదడులో రక్తం గడ్డకట్టినట్లు నిర్ధారణ.. 

 

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మొదట యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తో శనివారం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు డాక్టర్లు. రక్తం గడ్డకట్టడానికి అనేక కారణాలు కారణం కావచ్చు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడం అంటే ఏమిటి, వాటికి కారణాలు ఏమిటి..? అవి ఒక వ్యక్తి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేవి తెలుసుకోవడం ముఖ్యం.  

మెదడులో రక్తం గడ్డకట్టడం ఎందుకు ప్రమాదకరం..?


అనేక వ్యాధులు, పరిస్థితులు, పలు కారణాల వల్ల మెదడులో రక్తం గడ్డలు కట్టడం జరుగుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మెదడు గడ్డకట్టడాన్ని సెరిబ్రల్ థ్రాంబోసిస్ అని కూడా అంటారు. ఈ స్థితిలో, మెదడు సిరల్లో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది, దీని కారణంగా మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోతుంది. రక్త ప్రసరణలో ఆటంకం వల్ల మెదడు కణాలకు ఆక్సిజన్ చేరడం ఆగిపోయి కణాలు చనిపోవడం ప్రారంభమవుతుంది. దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణిస్తారు.  అంతేకాదు దీనివల్ల ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?  

 

ఇది కూడా చదవండి..బొప్పాయి తింటే వేడి చేస్తుందా..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.