బ్లడ్ క్యాన్సర్ వచ్చేముందే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?  

సాక్షి లైఫ్ : సాధారణంగా పొగాకు, ఆల్కహాల్, గుట్కా వంటివి క్యాన్సర్‌కు కారణమని భావిస్తారు. క్యాన్సర్ లో అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఒక్కో క్యాన్సర్ విషయంలో ఒక్కోరకమైన లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏ వ్యాధి విషయంలో నైనా సరే ముందస్తుగా ఆయా లక్షణాలను గుర్తిస్తే త్వరగా బయట పడొచ్చు. మే 28వతేదీన వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డే సందర్భంగా సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం..  

 ఇది కూడా చదవండి.. ప్రోస్టేట్ క్యాన్సర్ ను ఎలా నిరోధించవచ్చు..?

 బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు
 
క్యాన్సర్ అనేది ఎంత ప్రాణాంతకమైన వ్యాధి అనేది మనందరికీ తెలుసు. దీని పేరు వినగానే ప్రజలు భయపడిపోతారు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. శరీరంలో కణాలు అసాధారణంగా పెరగడాన్నే క్యాన్సర్ అంటారు. అయితే  క్యాన్సర్ లో అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. వాటి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్ ను హెమటోలాజిక్ మాలిగ్నన్సీ అని కూడా అంటారు. బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 
నిరంతరం అలసట.. 

కొన్నిసార్లు సరిగ్గా తినకపోవడం వల్ల లేదా శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. నిరంతరం అలసిపోతే, అది బ్లడ్ క్యాన్సర్ సంకేతం కావచ్చు. శరీరంలో రక్తం లేకపోవడం వల్ల కూడా రక్తహీనత సమస్య వస్తుంది.
 
ఆకస్మికంగా బరువు తగ్గడం.. 

శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగినప్పుడు, జీవక్రియలో మార్పులు సంభవిస్తాయి. అందులో భాగంగానే ఆకస్మికంగా శరీరం బరువు తగ్గుతుంది. బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో ఇది కూడా ఒకటి.


తరచుగా అంటువ్యాధులు..  

 నిరంతరం ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడినట్లయితే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. రక్త క్యాన్సర్ విషయంలో శరీరంలో తెల్లరక్త కణాల లోపం కారణంగా తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు.

వాపు శోషరస కణుపులు..  

శోషరస కణుపుల వాపునకు అనేక కారణాలు ఉండవచ్చు. తరచుగా ప్రజలు ఈ వాపును విస్మరిస్తారు. కానీ మెడ లేదా చంకలు వంటి ప్రాంతాల్లో నొప్పి అనిపిస్తే, వెంటనే వైద్యుడిని కలవండి.  

ఎముకలలో నొప్పి.. 

నిరంతరం వెన్నునొప్పి లేదా పక్కటెముకల నొప్పి ఉండవచ్చు. ఇవి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. ఐతే ఈ నొప్పితో నిరంతరం ఇబ్బంది పడుతుంటే, ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి.

 రక్తస్రావం..  

 శరీరంలో ఎక్కడైనా సరే చిన్న గాయం అయితే తీవ్రంగా రక్తం కారుతుంది. చాలా సేపటివరకు రక్తస్రావం ఆగదు. ఈ సంకేతం రక్త క్యాన్సర్కు సంబంధించినది కావచ్చు. చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణమే అని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : blood-cancer blood-cells white-blood-cells symptoms-of-blood-cancer world-blood-cancer-day world-blood-cancer-day-2024 blood-cancer-day blood-cancer-day-2024

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com