The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్  బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!

సాక్షి లైఫ్ : నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు మన జీర్ణ వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లఓ అద్భుతమైన పరిష్కారాన్ని సూచించారు. అదే '3-F' ఫార్ములా. పొట్టను శుద్ధి చేసి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఈ మూడు సూత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

అసలు ఏమిటీ '3-F' ఫార్ములా..?

1. పీచు పదార్థం (Fiber).. 

ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు పీచు పదార్థమే పునాది. మనం తీసుకునే ఆహారంలో పీచు తగినంత ఉంటేనే పొట్టలోని 'మంచి బ్యాక్టీరియా'కు సరైన పోషణ అందుతుంది. తృణధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగుల కదలికలు మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు.

2. పులియబెట్టిన ఆహారం (Fermented food)..  

పులియబెట్టిన ఆహార పదార్థాలు మన పొట్టకు వరప్రసాదం వంటివి. పెరుగు, మజ్జిగ వంటి పదార్థాల్లో ఉండే ప్రోబయోటిక్స్ పొట్టలోని సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జీర్ణకోశ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

3. ఉపవాసం (Fasting).. 

జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినివ్వడమే ఉపవాసం ఉద్దేశం. నిరంతరం పని చేసే మన జీర్ణక్రియకు ఉపవాసం ద్వారా విరామం ఇచ్చినప్పుడు, అది తనను తాను మరమ్మతు చేసుకునే అవకాశం లభిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, జీర్ణవ్యవస్థను 'రీసెట్' చేయడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

పోషకాలు సరిగ్గా గ్రహించటం వల్ల..

ఈ '3-F'లను పాటించడం వల్ల కేవలం జీర్ణక్రియే ఒక్కటే కాదు, శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పొట్ట శుభ్రంగా ఉంటే చర్మంపై సహజమైన మెరుపు వస్తుంది. మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తగ్గుతాయి. పోషకాలు సరిగ్గా గ్రహించటం వల్ల జుట్టు దృఢంగా మారుతుంది.

జీర్ణక్రియ సాఫీగా సాగితే రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా అనిపిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవనానికి ఈ మూడు సూత్రాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : gut-health fasting probiotics fiber probiotics-for-gut-health fermented-foods
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com