సాక్షి లైఫ్ : జీర్ణశక్తి మందగించే 'అగ్నిమాంద్యం', శరీరంలో విష వ్యర్థాలు పేరుకుపోయే 'ఆమం' ఈ సమస్యలకు ఎలా దారితీస్తాయి? మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చేసే ఏయే పొరపాట్లు సాధారణ ఎసిడిటీని దీర్ఘకాలిక సమస్యగా మారుస్తాయి? శరీర తత్వాన్ని (వాత, పిత్త, కఫ ప్రవృత్తులను) బట్టి ఈ సమస్యల లక్షణాలు ఎలా మారుతాయి..? కడుపులో విపరీతమైన మంట ఉంటే పిత్త దోషం అని, గ్యాస్ కదలకుండా పొట్ట బిగుతుగా ఉంటే వాత దోషం అని అంటారు కదా, ఈ రెండింటి తేడాను ఎలా గుర్తించాలి..?
నాలుకపై తెల్లటి లేదా పసుపు రంగు పూత ఏర్పడటానికి, జీర్ణకోశ సమస్యలకు ఉన్న సంబంధం ఏమిటి? తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా, గ్యాస్, కడుపుబ్బరం సమస్య శాశ్వతంగా నయమవ్వడానికి ఆయుర్వేదంలో ఎలాంటి నిర్దిష్ట చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? వంటింట్లో నిత్యం లభించే వాము, జీలకర్ర, సోంపు, ఇంగువ వంటి సహజ పదార్థాలతో గ్యాస్‌ను ఎలా శాశ్వతంగా నివారించవచ్చు?
త్రిఫల చూర్ణం, అవిపత్తికర చూర్ణం లేదా శంఖ వటి వంటి సాంప్రదాయ ఆయుర్వేద ఔషధాలను ఏ మోతాదులో, ఎవరి పర్యవేక్షణలో వాడాలి? దీర్ఘకాలిక ఎసిడిటీని మూలాల నుంచి తగ్గించడంలో వమనం, విరేచనం వంటి పంచకర్మ చికిత్సలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి? వంటింట్లో రోజూ చేసుకునే ‘జీలకర్ర, ధనియాలు, సోంపు’ (CCF టీ) ఎసిడిటీని ఎలా నియంత్రిస్తుంది?
పుల్లటి తేన్పులు, గుండెల్లో మంట ఉన్నప్పుడు ఆవు నెయ్యి ఔషధంలా ఎలా పనిచేస్తుంది, దానిని ఏ సమయంలో తీసుకోవాలి? కలబంద గుజ్జు లేదా ఉసిరి రసం కడుపులోని యాసిడ్ పొరలను ఎలా రక్షిస్తాయి, భోజనం తర్వాత కాస్త బెల్లం ముక్క తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.