శక్తికి దంతాలకు లింకేంటి..?  

సాక్షి లైఫ్ : శరీరానికి కావలసిన శక్తి అందాలంటే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇదేంటి శరీరానికి శక్తి అందడానికి, పండ్లకు సంబంధం ఏమిటబ్బా అనుకుంటున్నారా..? ఔను దంతాలు మంచిగా ఉంటేనే కదా ఆహారాన్ని చక్కగా నమిలి మింగగలిగేది. బాగా నమిలినప్పుడే కదా ఆహారం జీర్ణమవ్వడానికి సిద్ధమయ్యేది. 


 ఇది కూడా చదవండి.. గుడ్డు పచ్చసొన అంటే పసుపు భాగం తినకూడదా..?

అలా ఆహారం జీర్ణమైనప్పుడే కదా శక్తి విడుదలయ్యేది. అప్పుడే కదా ఆరోగ్యంగా ఉండి దైనందిన కార్యక్రమాలను నిర్వర్తించగలుగుతాం. కాబట్టి దంతాలను మనం ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి దంత సంరక్షణ కోసం ఏమేం చేయాలో తెలుసుకుందాం.. 

ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల టూత్ పేస్ట్ లో ఉండే రసాయనాల వల్ల దంతాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తక్కువసమయంలో పండ్లు తోముకోవాలి. చూడటానికి, తెల్లగా, గట్టిగా ఉండే దంతాలను సున్నితంగా సంరక్షించుకుంటే తప్ప అవి ఎక్కువ కాలం మనజాలవు. వీటి సంరక్షణ ఆవశ్యకత అర్థం కావాలంటే ముందు వాటి నిర్మాణం పై అవగాహన అవసరమ వుతుంది. దంతంపైభాగం ఎనామిల్‌ అనే పదార్థంతో ఏర్పడుతుంది. ఎనామిల్‌ తర్వాత డెంటిన్‌ అనే మరో పొర ఉంటుంది. డెంటిన్‌ తరువాత పల్ప్‌ కనిపిస్తుంది.

 ప్రతి దంతానికి దవడలో మూలం ఉంటుంది. ఎన్ని పండ్లుంటే అన్ని మూలాలు దవడ ఎముకలో ఉంటాయన్నమాట. ఈ దంతాల చుట్టూ చిగురు ఆవరించి ఉండి సిమెంట్‌ వలె పనిచేస్తుంది. చిగుళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే పండ్లు కూడా అంత గట్టిగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే వాచిపోయి దుర్వాసన వస్తుంది.


 ఇది కూడా చదవండి.. బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్ ఎన్నో..  

ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి భరించలేని వాసన వస్తుంది. ఫలితంగా చాలామంది మనల్ని తప్పించుకుని తిరిగే ప్రమాదమూ ఉంటుంది. చిగుళ్ల వాపువల్ల రక్తస్రావం కూడా కలుగుతుంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే దంతాలు కదలడం ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి.. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినొచ్చా..?  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : healthy-food dental-problems dental-health teeth teeth-health oral-health-tips physical-health oral-health tooth-brush

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com