Poly Trauma vs Complex Trauma : పాలీ ట్రామా - కాంప్లెక్స్ ట్రామా.. మధ్య వ్యత్యాసాలు ఏమిటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రోడ్డు ప్రమాదాలు లేదా ఎత్తు నుంచి పడటం వంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు తక్షణమే అందే వైద్యం వారి ప్రాణాలను నిలబెడుతుంది. అయితే, వైద్య పరిభాషలో ఈ గాయాలను వాటి తీవ్రతను బట్టి 'పాలీ ట్రామా', లేదా 'కాంప్లెక్స్ ట్రామా' అని అంటారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను 'గోల్డెన్ అవర్' అంటారు. ఈ సమయంలో సరైన ట్రామా సెంటర్‌కు చేర్చితే పాలీట్రామా బాధితులను కూడా మృత్యువు నుంచి రక్షించవచ్చు.

 

ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్‌ తగ్గుతుందా..?

ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

పాలీ ట్రామా అంటే..? 


వైద్య పరిభాషలో పాలీ ట్రామా అంటే శరీరంలోని వివిధ భాగాలు లేదా అవయవాలు (Multiple organs) ఒకేసారి తీవ్ర గాయాలకు గురికావడం. ఈ పరిస్థితిలో బాధితుడికి ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే, చికిత్స అందించే సమయంలో ఎముకలు లేదా ఇతర గాయాల కంటే కూడా, ప్రాణాన్ని నిలబెట్టే గుండె, ఊపిరితిత్తులు వంటి జీవనాధార వ్యవస్థలను (Life support systems) కాపాడటానికే వైద్యులు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మల్టీ-స్పెషాలిటీ వైద్య బృందం పర్యవేక్షణలో అత్యవసర శస్త్రచికిత్సలు ఇక్కడ అవసరమవుతాయి.

 కాంప్లెక్స్ ట్రామా..? 

 కాంప్లెక్స్ ట్రామా అనేది శరీరంలోని ఒకే భాగానికి పరిమితమైన- ప్పటికీ, ఆ ప్రాంతంలో గాయం అత్యంత లోతుగా తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక కాలు లేదా చేయి చితికిపోయినప్పుడు, అక్కడ ఎముకతో పాటు రక్తనాళాలు, నరాలు, కండరాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇందులో ప్రాణాపాయం కంటే కూడా సదరు అవయవం తన పనితీరును పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇక్కడ కణజాల పునర్నిర్మాణం (Reconstruction) ప్లాస్టిక్ సర్జరీ వంటి పద్ధతుల ద్వారా ఆ అవయవాన్ని తిరిగి కాపాడటంపై వైద్యులు దృష్టి సారిస్తారు.

ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్.. 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.