సాక్షి లైఫ్ : గతేడాది చైనాతోపాటు అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో పిల్లల్లో న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. అమెరికాతో పాటు, డెన్మార్క్ ,నెదర్లాండ్స్‌లో ఈ వ్యాధి కేసులు వచ్చాయి. దీనినే రహస్యమైన నిమోనియా అని "వైట్ లంగ్ సిండ్రోమ్" అని పేరు పెట్టారు. ఈ వ్యాధి ఎక్కువగా 3-8 సంవత్సరాల వయస్సు గల పిల్లలను ప్రభావితం చేస్తుంది.
ఈ వ్యాధి ఎందుకు వస్తుందనేదానికి ఖచ్చితమైన కారణం ఇంకా కనుగొనలేదు. అయితే ఈ వ్యాధికి కారణం మైకోప్లాస్మా న్యుమోనియా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అని కొందరు అంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. అయితే, చైనాలో పిల్లలలో సంభవించే శ్వాసకోశ వ్యాధికి దీనికి మధ్య ఇప్పటివరకు ఎటువంటి సంబంధం ఉన్నట్లు కనుగొనలేదు.