చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు సరైన పరిష్కారాలు..
సాక్షి లైఫ్: ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లుఎంజా వైరస్ వంటి అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. చల్లని వాతావరణంలోని మార్పులకారణంగా కారణంగా అనేక అనారోగ్య సమస్యలుతలెత్తు తున్నాయి. ముక్కు, శ్వాసనాళాలు, గొంతు,సైనస్ సమస్యలేకాకుండా, దగ్గుతో పాటు, కొంతమందికి ముక్కు మూసుకుపోవడం లేదా కారడం, తుమ్ములు, అలసట, గొంతు నొప్పి వంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. చలికాలంలో ప్రజలందరూ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పొడి దగ్గు..
తేనె దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి గొంతులో వాపును తగ్గించడంలో సహాయ పడతాయి. అంతేకాదు శ్లేష్మాన్నీ తగ్గించడంలోనూ గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మధుమేహం అదుపులో ఉండడంలేదా..? ఈటిప్స్ ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. పిల్లలలో థైరాయిడ్ లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎర్గోనామిక్ ఫర్నిచర్ పాత్ర.. ?
ఇది కూడా చదవండి.. ఓరల్ క్యాన్సర్ లక్షణాలను ముందుగా ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి.. పిల్లలకు ఇచ్చే టీకాల ప్రాముఖ్యత తెలుసా..?
ఒక కప్పు వేడి "టీ " లేదా వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల దగ్గు, గొంతు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గుతో బాధపడే పిల్లలకు తేనె ఇవ్వడం ప్రయోజనకరమని అధ్యయనాల్లో సైతం వెల్లడైంది.
ఉప్పు నీరు..
దగ్గు, గొంతు నొప్పి సమస్య ఉంటే ఉప్పు నీటితో పుక్కిలించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉప్పు నీరు కణజాలాల వాపును తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఉప్పు నోరు , గొంతులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ కనీసం మూడు సార్లు ఉప్పు నీటితో పుక్కిలిస్తే దగ్గు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఆవిరి పీల్చడం..
గొంతు నొప్పి లేదా ఇన్ఫెక్షన్ కారణంగా మూసుకు పోయిన ముక్కు సమస్యను తగ్గించడానికి ఆవిరిని పీల్చడం ప్రయోజనకరంగా ఉంటుంది. వేడి నీటి నుంచి వచ్చే ఆవిరి నాసికా రంధ్రాలను గొంతు పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు గొంతు నొప్పి, మంట, దగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి..రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య స్త్రీలకే ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..తెలంగాణలో మయోనైజ్ నిషేధం.. కారణం ఇదే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
