సాక్షి లైఫ్ : మార్కెట్లో దొరికే ప్యాకెట్ ఉప్పు వాడకూడదా..? ప్యాకెట్ సాల్ట్ మిషన్ల ద్వారా శుద్ధి చేస్తారు. దీనికి సోడియం, క్లోరైడ్, అయోడిన్ అనే మూడింటి తోపాటు అందంగా కనిపించేలా కృత్రిమ రసాయనాలను కలిపి తయారు చేస్తారు. అందువల్ల దీన్ని వాడటం వల్ల గాయిటర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
నార్మల్ గా ప్యాకెట్లలో దొరికే సాల్ట్‌కి రాక్ సాల్ట్‌కి తేడా ఏంటో చాలామందికి తెలియదు. దీనికి తోడు టీవీల్లో ప్యాకెట్ సాల్ట్ చాలా మంచిది అని ఇచ్చే ప్రకటనల కారణంగా కొంతమంది వాటినే వినియోగిస్తున్నారు. ఆయుర్వేద పరంగా రాళ్ల ఉప్పే మంచిదని చెబుతుంటారు. ఇంతకీ ఏది మంచిది..?
ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగించే 4 ఆహార పదార్థాలు..
ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..?
అధిక రక్తపోటుకి కారణంగా కూడా ఈ ప్యాకెట్ ఉప్పు వల్లనే అని తేల్చారు. మాములు ఉప్పులో 97శాతంసోడియం క్లోరైడ్, 3శాతం ఇతర మూలకాలు ఉంటాయి. ఇక రాతి ఉప్పు లేదా రాక్‌సాల్ట్, (రాళ్ల ఉప్పు) సముద్రం లేదా సరస్సుల్లో ఉండే ఉప్పు నీటి నుంచి తయారు చేస్తారు.
ఈ రాతి ఉప్పు ముతకగా ఉంటుంది. ఇందులో దాదాపు 85శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇక మిగిలిన 15శాతం ఇనుము, రాగి, జింక్, అయోడిన్, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం మొదలైన ఖనిజాలతో సహా సుమారు 84 రకాల మూలకాలు ఉంటాయి.
ఈ ఖనిజాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ రాళ్ల ఉప్పులో అయోడిన్‌ని కలపాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సాధారణ ఉప్పులో మాత్రం అయోడిన్ కలపాల్సి ఉంటుంది. అలాగే బ్లాక్ సాల్ట్‌లో కూడా రాక్‌సాల్ట్ మాదిరిగానే దీనిలో ఎన్నో ఖనిజాలు ఉన్నాయి.
ప్రయోజనాలు..
-నిద్రలేమి సమస్యలు ఉన్నవారు రాళ్ల ఉప్పును ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
-కొంతమంది రాతి ఉప్పును బాడీ స్క్రబ్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మ హైడ్రేషన్‌ను సమర్ధవంతంగా మెరుగుపరుస్తుంది.
-రాక్ సాల్ట్ చిగుళ్ళను శుభ్రం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
-మలబద్ధకాన్ని నివారించి జీర్ణ సంబంధిత సమస్యలను రాళ్ల ఉప్పు మెరుగుపరుస్తుంది.
-మైగ్రేన్ నొప్పికి కారణమయ్యే మెగ్నీషియం లోపాన్ని కూడా రాక్ సాల్ట్ భర్తీ చేస్తుంది.
-సాధారణ ఉప్పును అధికంగా ఉపయోగించడం వల్ల అధిక రక్తపోటు తలెత్తే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది.
-చర్మం, జుట్టు ఆరోగ్యాన్నిపెంపండించడంలో కీలక పాత్ర పోషిస్తుంది రాక్ సాల్ట్.
-పలు రకాల ఖనిజాలను కలిగి ఉండటం వల్ల, రాతి ఉప్పు అనేక వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
-ఇది సైనస్ చికిత్సలో సహాయపడుతుంది. ఈ రాతి ఉప్పు లేదా రాళ్ల ఉప్పు సరైన క్యాంటిటీలో ఉపయోగిస్తే అధిక బరువు సమస్య ఉండదు.