సాక్షి లైఫ్ : ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయ , ఖర్బూజా లాంటి పండ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఈ రెండూ రుచిలో అద్భుతంగా ఉండటమే కాక, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ, వీటిలో ఏది శరీరానికి ఎక్కువ మేలు చేస్తుందనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఈ రెండు పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..అపోహ : హోమియోపతి చికిత్సలో వ్యాధి ముందు పెరుగుతుంది..
ఇది కూడా చదవండి..ఎండాకాలంలో డీహైడ్రేషన్ ను తగ్గించే 5 సమ్మర్ డ్రింక్స్..
ఇది కూడా చదవండి..వరల్డ్ హోమియోపతి డే -2025 : అపోహ : హోమియోపతి మందులు ఆలస్యంగా పనిచేస్తాయా..?
పోషక విలువల్లో..
పుచ్చకాయలో 100 గ్రాములకు 30 కేలరీలు, 0.61 గ్రాముల ప్రోటీన్, 92శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, బీ1, బీ5, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఖర్బూజాలో 100 గ్రాములకు 28 కేలరీలు, 1.11 గ్రాముల ప్రోటీన్, 90శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ సీ, బీ6, కె , ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
ఎండాకాలంలో ఎందుకు ఉత్తమం అంటే..?
- పుచ్చకాయ : 92% నీటి శాతంతో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇందులో ఉండే లైకోపీన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సోడియం తక్కువగా ఉండటం వల్ల రక్తపోటు ఉన్నవారికి అనువైనది.
ఖర్బూజా : విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొటాషియం శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతుంది.
బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..?
రెండూ తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉండటంతో బరువు తగ్గడానికి సహాయపడతాయి. అయితే, పుచ్చకాయలో షుగర్ 7 గ్రాములు, ఖర్బూజాలో 8 గ్రాములు ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పుచ్చకాయ బరువు తగ్గడంలో కొంచెం ఎక్కువ ప్రభావం చూపుతుంది.
ఏది ఎంచుకోవాలి..?
పుచ్చకాయ డీహైడ్రేషన్‌కు అద్భుతంగా అనిచేస్తుంది, ఖర్బూజా విటమిన్లు, ఫైబర్‌తో ఆరోగ్యాన్ని కాపాడుతుంది. "రెండూ సమతులంగా తీసుకుంటే ఎండాకాలంలో శరీరానికి పూర్తి పోషణ లభిస్తుంది. స్థానికంగా, సీజన్‌లో లభించే వీటిని తప్పక తినాలి" అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com