సాక్షి లైఫ్ : గుండెపోటు సంభవించినప్పుడు మొదటి గంట (Golden Hour) ఎంతో ముఖ్యమని, ఆలస్యం చేయకుండా రోగిని ఆసుపత్రికి చేర్చడం అత్యవసరమని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహ (డయాబెటిస్) రోగులు గుండె ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రముఖ వైద్యులు గుండెపోటు లక్షణాలు, నివారణ పద్ధతులపై కీలక అంశాలను వెల్లడించారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
"గోల్డెన్ హవర్" ప్రాముఖ్యత..!
ఆధునిక జీవనశైలిలో చాలామంది సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని, కాలుష్యం నుంచి కూడా రక్షణ చాలా అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు సంభవించిన తర్వాత తొలి గంట (60 నిమిషాలు) ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా అవసరం. అయితే, ఒక హృద్రోగికి ప్రతి నిమిషం విలువైనదే. రోగి ఎంత త్వరగా ఆసుపత్రికి చేరుకుంటే, చికిత్స అంత త్వరగా ప్రారంభించవచ్చు. దీనివల్ల వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే కాలయాపన చేయకుండా దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని, ప్రాథమిక చికిత్స (First Aid) అనంతరం పరిస్థితి మెరుగైతే, ఆ తర్వాత వారు కోరుకున్న ఆసుపత్రి లేదా వైద్యుడిని సంప్రదించవచ్చని, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 'గోల్డెన్ రూల్' పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం (Healthy Diet)..
పప్పులు, సోయాబీన్ వంటి పోషక విలువలున్న ఆహారాలను మీ డైట్‌లో తప్పక చేర్చుకోవాలి.
జిమ్ చేసేవారు లేదా అథ్లెట్లు బయటి నుంచి అదనపు సప్లిమెంట్స్ తీసుకోవడం కంటే, సాధారణ పౌష్టికాహారంపైనే దృష్టి పెట్టాలి.
బాల్యం నుంచే జాగ్రత్తలు..
పిల్లలకు మూడు నుంచి నాలుగేళ్ల వయసులోనే తరచుగా దగ్గు, జలుబు, జ్వరం, అలసట లేదా ఎదుగుదల లోపం కనిపిస్తే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి పిల్లలకు వెంటనే ECG, 2D ఎకో-కార్డియోగ్రఫీ పరీక్షలు చేయించాలి.
ప్రమాదకర లక్షణాలు..
25 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. గుండెకు రక్త సరఫరాను అందించే కొరోనరీ ధమనుల్లో అడ్డంకులు (బ్లాకేజీలు) ఏర్పడితే హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయవచ్చు.
అలసట, విపరీతమైన చెమట పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చేతులు, ఛాతీలో నొప్పి లేదా దవడ నుంచి బొడ్డు వరకు నొప్పి అనిపిస్తే తప్పకుండా జాగ్రత్త వహించాలి.
డయాబెటిస్ రోగులకు సూచనలు..
డయాబెటిస్ రోగులకు గుండె నొప్పి (ఛాతీ నొప్పి) లక్షణాలు సరిగా తెలియకపోవచ్చు (Silent Attack). షుగర్ రోగులు గుండె ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉంటూ, డాక్టర్ సలహా మేరకు తరచుగా పరీక్షలు చేయించుకోవాలి.
జీవనశైలి మార్పులు..
పని, విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించాలి. రోజూ కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి. శారీరక శ్రమను పెంచండి, నిరంతరం చురుకుగా ఉండండి. యోగా, వ్యాయామం అలవాటు చేసుకోండి. ఒత్తిడి (Stress)కి దూరంగా ఉండాలి. గుండెకు అత్యంత ప్రమాదకరమైనది ఊబకాయం (Obesity). కొవ్వు పేరుకుపోకుండా చూసుకుంటూ, బరువును అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారానే గుండెను పదిలంగా కాపాడుకోవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com