ఎగ్ ఫ్రీజింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో, స్త్రీలు సరైన వయస్సులో తమ ఎగ్స్ ను సంరక్షించుకోగలరు. తద్వారా భవిష్యత్తులో ఆరోగ్యకరమైన గర్భం కోసం వాటిని ఉపయోగించుకోవచ్చు. క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న మహిళలకు ఇది మరింత మేలు చేస్తుంది. క్యాన్సర్ కూడా సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎగ్ ఫ్రీజింగ్ ను "ఓసైట్ క్రయోప్రెజర్వేషన్" అని కూడా అంటారు. ఎగ్ ఫ్రీజింగ్ కు సరైన వయస్సు 20 నుంచి 30 సంవత్సరాలు అయితేనే మంచిదని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..అధిక ప్రోటీన్ ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

అంతేకాకుండా తమ కెరీర్ మొదటి ప్రాధాన్యత ఇచ్చే మహిళలకు ఈ ప్రక్రియ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని సహాయంతోవారికి నచ్చిన సమయంలో తల్లి అవ్వడానికి వీలుంటుంది.

ఎగ్ ఫ్రీజింగ్ స్త్రీలకు ఒక రకమైన స్వేచ్ఛను అందిస్తుంది. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిడ్డకు జన్మనిచ్చే అవకాశం పొందవచ్చు. అంతేకాదు తద్వారా మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆమె తన కోరిక మేరకు తల్లి కావాలనే నిర్ణయాన్ని తీసుకోవచ్చు. దీని కోసంబయోలాజికల్ క్లాక్ పై ఆధారపడవలసిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.