గుడ్ ఫుడ్ : మొక్కల ఆధారిత ఆహారం తీసుకునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ..
సాక్షి లైఫ్ : మొక్కల ఆధారిత ఆహారం తీసుకునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని స్కాట్లాండ్‌లోని గ్లాస్గో విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం యూకే బయోబ్యాంక్ డేటాను విశ్లేషించి, 2014 నుంచి 2020 వరకు 30 నుంచి 70 ఏళ్ల వయస్సు గల మహిళల ఆహార అలవాట్లను పరిశీలించింది.
ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ కోసం 5 సోడియం తక్కువగా కలిగిన ఆహారాలు..
ఇది కూడా చదవండి..సమ్మర్ అలర్ట్ : వేసవిలో ఏ రకమైన ఆహారాలకు దూరంగా ఉండాలి..?
ఇది కూడా చదవండి..కీమోథెరపీ వల్ల వచ్చే రక్తహీనతకు అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఔషధం..
సమతుల్య మొక్కల ఆధారిత ఆహారం, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన జీవనశైలిని సిఫార్సు చేస్తున్నారు వైద్య నిపుణులు. ఈ అధ్యయనంలో ఆహారపు అలవాట్లు క్యాన్సర్ నివారణలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి..? అనేదానిపై ప్రత్యేకంగా శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.
మాంసం, పాల ఉత్పత్తులకు బదులుగా పండ్లు, కూరగాయలు, గింజలు, చిరుధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారం తీసుకునేవారిలో రొమ్ము క్యాన్సర్ రిస్క్ 20శాతం నుంచి 30శాతం తగ్గినట్లు గుర్తించారు. అయితే, అనారోగ్యకరమైన మొక్కల ఆధారిత ఆహారం (ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ డ్రింక్స్) తీసుకునే వారిలో ఈ ప్రయోజనం కనిపించలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
