మునగలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయా..?   

సాక్షి లైఫ్ : చర్మం,జుట్టుకు మేలు చేస్తుంది: మొరింగలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇది చర్మం కాంతివంతంగా, జుట్టును బలంగా మార్చడంలో సహాయపడుతుంది.యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు: మునగలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు ఆర్థరైటిస్, ఇతర వ్యాధులున్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది మీకు చాలా కాలం పాటు కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది. అందువల్ల ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మునగను ఆహారంలో ఎలా భాగం చేసుకోవచ్చు?

మునగను వివిధ మార్గాల్లో తినవచ్చు.. పొడి- మున ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. ఈ పొడిని స్మూతీ, సూప్ లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు.
మునగఆకులను ఉడకబెట్టడం ద్వారా టీ-టీని తయారు చేయవచ్చు.
మునగ వెజిటబుల్- ఇతర కూరగాయలతో కలిపి మొరింగ వెజిటబుల్ కర్రీ తయారు చేయవచ్చు.

మునగతీసుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

మునగ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, ఎక్కువ మోతాదులో తినడం వల్ల కొందరిలో అలర్జీ సమస్యలు వస్తాయి. గర్భిణీ స్త్రీలు, బిడ్డకు పాలిస్తున్న మహిళలు మునగ ఆకుతీసుకునే ముందు తప్పకుండా వైద్యనిపుణులను సంప్రదించాలి.


 ఇది కూడా చదవండి.. యునాని వైద్యానికి అల్లోపతి వైద్యానికి ఏంటి లింక్..?

 ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-benefits-of-moringa-leaves-powder moringa-leaves-benefits moringa-leaves-amazing-benefits moringa-leaves moringa moringa-and-blood-sugar moringa-benefits moringa-leafes moringa-powder moringa-powder-benefits moringa-tree moringa-tea health-benefits-of-moringa moringa-health-benefits benefits-of-moringa moringa-for-weight-loss is-moringa-good-for-controlling-blood-sugar
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com