జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలి..? ఏం చేయకూడదో తెలుసా..?    

సాక్షి లైఫ్ : జుట్టు సంరక్షణ కోసం పలు రకాల చిట్కాలను పాటిస్తే.. హెయిర్ ఫాల్ సమస్య ను అధిగమించవచ్చు. అంతేకాదు మీ వయసు పెరిగేకొద్దీ జుట్టు రాలే సమస్య తలెత్తకుండా ఉంటుంది. అందుకోసమే శిరోజాల సంరక్షణకు తప్పనిసరిగా చేయాల్సినవి.. చేయకూడనివి తెలుసుకోవాలి.. అవేంటంటే..? 

- షాంపూ తో తలస్నానం చేసేటప్పుడు వేడి నీటిని ఉపయోగించకూడదు.  

 - ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, గుడ్లు, ప్రొటీన్స్, హెర్బల్ షాంపూల వల్ల శిరోజాలు పెరుగుతాయని భ్రమపడతారు. కానీ ఇవి కేశాలకు పోషక విలువలను మాత్రమే కలుగజేస్తాయి.

-నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళు కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి, తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

- సాధ్యమైనంతవరకు శిరోజాలకు సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్తపడాలి. 

-సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలవలన వెంట్రుకలు బిరుసుగా తయారవుతాయి. దానివలన శిరోజాలు త్వరగా నెరుస్తాయి. 

- ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు ఆహారంలో నూనె, కొవ్వు అధికంగా ఉన్న పదార్థాలు తగ్గించాలి.

-డ్రై హెయిర్, నార్మల్ హెయిర్ కలవారికంటే ఆయిలీ హెయిర్ కలిగినవారు తరచుగా తలస్నానం చేస్తుండాలి.

-శిరోజాల చివరలు కత్తిరిస్తే, త్వరగా పెరుగుతాయనే అపోహ కొందరికి ఉంటుంది. కానీ ఇది అపోహ మాత్రమే. 

-కేశాల చివరలు కత్తిరిస్తే కేశం పూర్తిగా చిట్లిపోకుండా నివారించవచ్చు. అంతే.. 

-జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే దృఢంగా ఉండే దువ్వెనలు వాడకూడదు.  

-సాధ్యమైనంత వరకు మృదువయిన హెయిర్ బ్రష్‌లను, పళ్ళు దూరంగా ఉండే దువ్వెనను ఉపయోగిస్తే శిరోజాలు త్వరగా రాలిపోకుండా ఉంటాయి. 

-వెంట్రుకలకు కలర్ వేసేటప్పుడు అమోనియా లేని న్యాచురల్ కలర్ మాత్రమే వాడాలి.  

అమోనియా కలిగిన హెయిర్ కలర్ వాడడంవల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.  
-జడ బిగించి వేసుకున్నట్లయితే శిరోజాలు రాలిపోతాయి.

-ఆరోగ్యవంతమైన శిరోజాల కోసం ఆహారంలో విటమిన్ ఎ, బి అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. 
ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తే కాటన్ క్యాప్ వాడడం మంచిది. 

జీడిగింజలను పగులగొట్టి నువ్వుల నూనెలో వేసి మరిగించి తలకు రాసుకుంటే శిరోజాలు క్రమంగా నల్లబడతాయి. 

-నిమ్మచెక్కలను బాగా ఎండబెట్టి, పొడి చేసి, దాన్ని సీకాయ పొడిలో కలుపుకొని తల స్నానం చేస్తే శిరోజాలు చక్కని మెరుపును సంతరించుకుంటాయి.

-పేనుకొరుకుడు ఉన్న ప్రదేశంలో మందార పువ్వులతో చక్కగా మర్దనా చేసినట్లయితే, చక్కని ఫలితం పొందవచ్చు.

-నువ్వుల నూనె, ఉసిరికాయల రసం సమభాగాలుగా కలిపి, కాచి, చల్లార్చి ప్రతిరోజు తలకు రాసుకుంటే శిరోజాలు తెల్లవెంట్రుకలు రావు.

-జుట్టు పల్చగా ఉంటే ప్రతిరోజు పచ్చిపాలను కుదుళ్ళకు బాగా రాసి, గంట తర్వాత, తల స్నానం చేస్తే కొద్దిరోజుల్లోనే జుట్టు విపరీతంగా పెరుగుతుంది. 

 - పోషకాహారంతో పాటు సంరక్షణ జాగ్రత్తలు పాటిస్తే జుట్టుకి పెరుగుదల ఉంటుంది. 
-పౌష్టికాహారం వల్ల శిరోజాలకు కావలసిన విటమిన్స్ అందుతాయి. ఇవి జుట్టు రాలడాన్ని అరికట్టి పెరిగేందుకు సహాయపడతాయి.

- జుట్టుకి స్వచ్ఛమైన కొబ్బరినూనెని వేడిచేసి గోరువెచ్చటి నూనెతో తలకి మసాజ్ చేయాలి. ఆ తరువాత తలస్నానం చేస్తే జుట్టుకి మంచి రక్తప్రసరణ జరిగి ఒత్తయిన జుట్టు వస్తుంది.

- మానసిక ఇబ్బందులకు దూరంగా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా మానసిక కారణాల వల్లే జుట్టు ఊడుతుంది.

-ఆయిల్ మసాజ్ చేసుకున్న తరువాత తలస్నానం చేసేందుకు మంచి షాంపూలను ఎంచుకోవాలి. తలస్నానం తరువాత మంచి కండీషనర్ పెట్టుకోవాలి. 

-ఇలా పెట్టడం వల్ల జుట్టు రాలకుండా దృఢంగా ఉంటుంది.
ఇలాంటి సులభమైన చిట్కాలు పాటించడం వల్ల శిరోజాలకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.


 

Tags : white-hairs

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com