సాక్షి లైఫ్ : రాబోయే 25 ఏళ్లలో మహిళల్లో గుండె జబ్బులు, స్ట్రోక్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజా నివేదికలో వెల్లడైంది.. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది. మహిళల ఆరోగ్యానికి సంబంధించి రాబోయే కాలం సవాల్‌గా మారనుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) హెచ్చరించింది. ప్రస్తుత జీవనశైలి మార్పుల వల్ల రాబోయే 25 ఏళ్లలో మహిళల్లో గుండె జబ్బులు, పక్షవాతం (స్ట్రోక్) బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరగవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా యువతుల్లో సైతం ఈ ముప్పు పొంచి ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ప్రధాన కారణాలు ఏమిటీ అంటే..?
వ్యాధుల పెరుగుదలకు ప్రధానంగా మూడు కారణాలను నివేదిక ఎత్తిచూపింది. అటువంటివాటిలో.. ఊబకాయం (Obesity).. శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్ల వల్ల బరువు పెరగడం గుండెపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మధుమేహం (Diabetes).. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల రక్త నాళాలు దెబ్బతిని గుండె పోటుకు దారితీస్తున్నాయి. అధిక రక్తపోటు (High BP)..దీనిని ‘సైలెంట్ కిల్లర్’గా అభివర్ణించిన వైద్యులు, యువతుల్లో కూడా బీపీ పెరగడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
ప్రస్తుత ధోరణి కొనసాగితే 2050 నాటికి పరిస్థితులు ఎలా ఉండవచ్చంటే..?
ప్రతి 10 మంది మహిళల్లో 6 గురు ఏదో ఒక రకమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడే అవకాశం ఉంది. రక్తపోటు బాధితుల సంఖ్య 49శాతం నుంచి 60శాతానికి పెరగవచ్చు. ఊబకాయం బాధితులు 44శాతం నుంచి 61శాతానికి చేరుకోవచ్చని అంచనా.
చిన్న వయసులోనే ప్రమాదం..
గతంలో గుండె జబ్బులు అంటే వయసు పైబడిన వారికే వస్తాయనే భావన ఉండేది. కానీ, ఇప్పుడు 22 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో కూడా మధుమేహం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని, ఇది వారిని చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడేలా చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com