IVF : సంతానలేమికి సంజీవని ‘ఐవీఎఫ్’.. ఏ జంటలకు ఇది అవసరం..? నిపుణులు ఏమంటున్నారు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల నేడు సమాజంలో సంతానలేమి సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. ఒకప్పుడు సహజంగానే గర్భధారణ జరిగినప్పటికీ.. ప్రస్తుత కాలంలో చాలా మంది జంటలు సంతానం కోసం నెలలు, సంవత్సరాల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలాంటి దంపతులకు ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) వంటి అధునాతన సహాయక పునరుత్పత్తి సాంకేతికత ఒక గొప్ప ఆశాకిరణంగా నిలుస్తోంది. 

ఇది కూడా చదవండి..War Impact : యుద్ధం ఎఫెక్ట్ : మరింత భారం కానున్న దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలు.. 

ఇది కూడా చదవండి..LynchVax Vaccine : క్యాన్సర్‌కు ముకుతాడు.. ముందే అడ్డుకునే 'లించ్‌వ్యాక్స్' టీకా..!

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..Snakebite Crisis in Telangana : తెలంగాణలో పాముకాటుతో వందలో 13 మంది బలి..! ‘సీసీఎంబీ-లాకోన్స్’ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడి.. 

 

అయితే, సంతానలేమి సమస్య అనగానే కేవలం మహిళలదే బాధ్యత అనుకుంటే పొరపాటే. వైద్య నివేదికల ప్రకారం.. దాదాపు 50 శాతం కేసుల్లో పురుషులలోని లోపాలే ఇందుకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐవీఎఫ్ చికిత్స ఎప్పుడు అవసరమవుతుంది..? అసలు ఈ ప్రక్రియ ఎలా సాగుతుందో ప్రముఖ ఐవీఎఫ్ నిపుణులు అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణ మీకోసం..

సహజ గర్భధారణ ఎలా జరుగుతుంది?సాధారణంగా ప్రతి నెలా స్త్రీ శరీరంలో ఒక అండం విడుదలవుతుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషుడి నుంచి విడుదలయ్యే శుక్రకణాలు గర్భాశయం గుండా ప్రయాణించి, ఫెలోపియన్ ట్యూబ్‌లో ఉన్న అండాన్ని చేరుకుంటాయి. అక్కడ అండం, శుక్రకణం కలవడం వల్ల పిండం ఏర్పడుతుంది. ఐదు రోజుల తర్వాత ఈ పిండం ఫెలోపియన్ ట్యూబ్ నుంచి గర్భాశయానికి చేరుకుని, అక్కడ తొమ్మిది నెలల పాటు పెరుగుతుంది. 

ఐవీఎఫ్ ఎప్పుడు అవసరమవుతుంది అంటే..?

కింది సమస్యలు ఉన్నప్పుడు సహజ పద్ధతిలో గర్భధారణ కష్టమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో వైద్యులు ఐవీఎఫ్ విధానాన్ని సిఫార్సు చేస్తారు:ట్యూబుల సమస్యలు: మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్‌లు పూర్తిగా మూసుకుపోవడం లేదా దెబ్బతినడం.తక్కువ అండాలు: స్త్రీ శరీరంలో అండాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం.

పురుషులలో లోపాలు..

శుక్రకణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటం (కౌంట్ 10 మిలియన్ల కన్నా తక్కువ ఉండటం) లేదా వాటి కదలికల్లో లోపాలు ఉండటం.ఇతర గర్భాశయ సమస్యలు: గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు (గడ్డలు) ఉండటం లేదా హార్మోన్ల అసమతుల్యత.ఐవీఎఫ్ ప్రక్రియ ఎలా సాగుతుంది?ఐవీఎఫ్ చికిత్సలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి.

1.అండాల ఉత్పత్తిని ప్రేరేపించడం..


10 నుంచి 12 రోజులు.మహిళల్లో రెండు అండాశయాలలోనూ ఎక్కువ సంఖ్యలో అండాలు ఉత్పత్తి అయ్యేలా చూసేందుకు సుమారు 10 నుంచి 12 రోజుల పాటు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. 2.అండాల సేకరణ..వైద్య ప్రక్రియ. అండాలు తగిన పరిపక్వతకు వచ్చిన తర్వాత, ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా స్త్రీ శరీరం నుంచి వాటిని బయటకు తీస్తారు.

3. ప్రయోగశాలలో ఫలదీకరణం:ల్యాబ్ విధానం.సేకరించిన అండాలను, భర్త నుంచి తీసుకున్న నాణ్యమైన శుక్రకణాలతో ప్రయోగశాలలో కలుపుతారు. దీనివల్ల పిండం (Embryo) ఏర్పడుతుంది. 

4.పిండ బదిలీ (ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్)..చివరి దశ.ఏర్పడిన పిండాన్ని 3 నుంచి 4 రోజుల తర్వాత తిరిగి మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఒకవేళ ఆ సమయంలో గర్భాశయం పిండాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే, దానికి తగినట్లుగా మరికొన్ని వైద్య ప్రక్రియలు నిర్వహిస్తారు.

ముందస్తు జాగ్రత్తలతో ముప్పునకు చెక్..!

సంతానలేమి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, ఊబకాయం బారిన పడకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానం వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఈ సమస్యల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.