Female Viagra: స్త్రీలల్లో తగ్గుతున్న కోరికలు.. పరిష్కారం దిశగా సరికొత్త ఔషధాలు..!
సాక్షి లైఫ్ : సాధారణంగా 50 ఏళ్లు దాటిన మహిళల్లో మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోవడం కారణంగా హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం వల్ల శారీరక మార్పులతో పాటు లైంగిక కోరికలు కూడా క్షీణిస్తుంటాయి. అయితే, ఇలాంటి సమస్యతో బాధపడుతున్న (Hypoactive Sexual Desire Disorder - HSDD) మహిళల కోసం వైద్యశాస్త్రం సరికొత్త ఔషధాలను అందుబాటులోకి తెచ్చింది.
ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
అమెరికా ఎఫ్‌డీఏ (FDA) గ్రీన్ సిగ్నల్..
ఇప్పటివరకు యువతులకు మాత్రమే పరిమితమైన 'యాడ్డీ' (Addyi - Flibanserin) వంటి మాత్రలను, 65 ఏళ్ల వరకు ఉన్న మెనోపాజ్ దాటిన మహిళలకు కూడా వాడొచ్చని అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవల విస్తృత అనుమతులు ఇచ్చింది. వీటిని 'ఫీమేల్ వయాగ్రా' అని పిలిచినప్పటికీ, ఇవి పురుషుల మందుల కంటే భిన్నంగా పని చేస్తాయి.
ఈ మాత్రలు ఎలా పని చేస్తాయి..?
ఇవి రక్త ప్రసరణపై కాకుండా, మెదడులోని కెమికల్స్‌పై ప్రభావం చూపుతాయి. మనసును ఉత్సాహపరిచే డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రైన్ స్థాయిలను పెంచి, కోరికలను తగ్గించే సెరోటోనిన్‌ను నియంత్రిస్తాయి. వీటిని ప్రతిరోజూ పడుకునే ముందు రాత్రి సమయంలో మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు..?
ఈ మందుల వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ముఖ్యంగా ఈ మాత్రలు వేసుకునే ముందు లేదా తర్వాత మద్యం సేవించడం ప్రమాదకరం. దీనివల్ల రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయి సొమ్మసిల్లి పడిపోయే అవకాశం ఉంది. వికారం, తల తిరగడం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ మందులకు దూరంగా ఉండాలి.
సహజ మార్గాలు కూడా ముఖ్యం..
మాత్రలతో పాటు జీవనశైలిలో మార్పులు కూడా అవసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రోజూ కనీసం 30 నిమిషాల నడక హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది. డ్రై ఫ్రూట్స్, గింజలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల సహజంగానే శక్తి పెరుగుతుంది.
ధ్యానం లేదా యోగా ద్వారా మానసిక ప్రశాంతత పొందితే ఫలితం మెరుగ్గా ఉంటుంది. ఎలాంటి మందులైనా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ముఖ్యంగా గుండె, కాలేయ సమస్యలు ఉన్నవాళ్లు ఖచ్చితంగా వైద్యనిపుణులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి.. బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఇవి మీకోసమే..
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
