Reveals Latest NSO Report : దేశంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీల కోసం పెరుగుతున్న సంఖ్య.. NSO తాజా నివేదికలో వెల్లడి..
సాక్షి లైఫ్ : దేశంలో డెలివరీల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలతో పోలిస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాల ఖర్చు దాదాపు 16 రెట్లు అధికంగా ఉందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (NSO) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. ప్రైవేటు వైద్యంపై ప్రజలు ఎక్కువగా ఆధారపడటం వల్ల సామాన్యుల జేబులకు భారీగా చిల్లులు పడుతున్నాయని స్పష్టమైంది.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసం..
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అయ్యే సగటు ప్రసవ ఖర్చుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక ప్రసవానికి సగటున రూ. 37,630 ఖర్చవుతుండగా, సాధారణ మధ్యస్థ (Median) ఖర్చు రూ. 32,000 గా ఉంది. అదే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే సగటున కేవలం రూ. 2,299 ఖర్చవుతుండగా, మధ్యస్థ ఖర్చు కేవలం రూ. 801 గా మాత్రమే ఉంది.
ఈ గణాంకాలను పరిశీలిస్తే రెండు చోట్లా అయ్యే ఖర్చుల మధ్య ఎంతటి భారీ వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రుల్లో ప్రసవాలు 96 శాతానికి పైగా.. దేశంలో సురక్షిత ప్రసవాల దిశగా భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. ప్రస్తుతం దేశంలో జరిగే మొత్తం ప్రసవాలలో 96.2 శాతం డెలివరీలు ఆసుపత్రుల్లోనే (Institutional Deliveries) జరుగుతుండటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రి ప్రసవాల రేటు గతంలో 90.5 శాతం ఉండగా.. అదిప్పుడు 95.6 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 96.1 శాతం నుంచి 97.8 శాతానికి చేరుకుంది.
ప్రైవేటు వైపే మొగ్గు.. ఎందుకంటే..?
ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా కుటుంబాలు ప్రైవేటు ఆసుపత్రులవైపే మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో 50.8 శాతం మంది ప్రైవేటు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 21.3 శాతం నుండి 28.8 శాతానికి పెరిగింది. మెరుగైన సౌకర్యాలు, 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయనే నమ్మకంతోనే చాలామంది ప్రైవేటు ఆసుపత్రులను ఎంచుకుంటున్నారు," అని వైద్యనిపుణులు చెబుతున్నారు.
మరోవైపు గర్భధారణ సమయంలో దాదాపు 98 శాతం మంది మహిళలకు ముందస్తు వైద్య సంరక్షణ (Ante-natal care) అందుతున్నప్పటికీ.. ప్రసవం తర్వాత (Post-natal care) తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఇంకా పెరగాల్సి ఉందని నివేదిక అభిప్రాయపడింది. సురక్షిత ప్రసవాల విషయంలో భారత్ విజయం సాధించినప్పటికీ.. సాధారణ ప్రజలకు ఈ వైద్యం మరింత చౌకగా అందేలా చూడటం ఇప్పటికీ ఒక సవాలుగానే మిగిలింది.
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
