Essential Medical Tests : 50ఏళ్ల వయసు దాటాక మహిళలను తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించే వైద్య పరీక్షలు..
సాక్షి లైఫ్ : యాభై ఏళ్లు దాటిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులు, మెనోపాజ్ వంటి కారణాల వల్ల గుండె జబ్బులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా 50ఏళ్ల వయసు దాటాక మహిళలకు తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం మరింతగా ఉంటుంది. అందుకోసమే ఐదు పదులు వయసు దాటాక ఆయా ముప్పు నుంచి రక్షించే వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యనిపుణు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
1. చక్కెర స్థాయిలపై నిఘా..
వయసు పెరిగే కొద్దీ రక్తపోటు (BP), రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల మహిళల్లో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏం చేయాలి మరి..?
ఏటా కనీసం ఒక్కసారైనా లిపిడ్ ప్రొఫైల్, చక్కెర పరీక్షలు చేయించాలి. గత మూడు నెలల సగటును తెలిపే HbA1c పరీక్ష ద్వారా మధుమేహాన్ని ముందే గుర్తించవచ్చు.
2. ఎముకల బలం..
మెనోపాజ్ తర్వాత కాల్షియం వేగంగా నశించిపోవడం వల్ల ఎముకలు గుల్లబారిపోయే 'ఆస్టియోపొరోసిస్' వచ్చే ప్రమాదం ఉంది. 50 దాటిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఏం చేయాలి మరి..?
ఎముకల సాంద్రతను తెలుసుకోవడానికి బోన్ మినరల్ డెన్సిటీ (BMD) పరీక్ష చేయించాలి. నడుము నొప్పి, తరచూ ఎముకలు విరగడం వంటి లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు.
3. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ (మామోగ్రఫీ)..
మహిళలను వేధిస్తున్న ప్రధాన క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. దీనిని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స చాలా సులభం అవుతుంది.
ఏం చేయాలి?: 40-50 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా మామోగ్రఫీ చేయించుకోవాలి. రొమ్ములో ఎలాంటి చిన్న మార్పులు, గడ్డలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
4. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ..
భారతదేశంలో మహిళల్లో కనిపించే మరో ప్రధాన సమస్య సర్వైకల్ క్యాన్సర్. క్రమబద్ధమైన స్క్రీనింగ్ ద్వారా దీనిని నివారించవచ్చు.
ఏం చేయాలి మరి..?
30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా నిర్ణీత కాల వ్యవధిలో పాప్ స్మియర్ (Pap Smear) పరీక్ష చేయించుకోవాలి. ఇది గర్భాశయ ముఖద్వారంలోని అసాధారణ కణాలను ముందే పసిగడుతుంది.
5. కంటి చూపు..
మధుమేహం, రక్తపోటు ఉన్నవారిలో కంటిచూపు మందగించే ప్రమాదం ఉంది. శుక్లాలు (Cataracts), గ్లాకోమా వంటి సమస్యలు వయసుతో పాటు పెరుగుతాయి.
ఏం చేయాలి మరి..?
ఏటా ఒకసారి సమగ్ర కంటి పరీక్ష చేయించాలి. దీనివల్ల దృష్టి లోపాలను సరిదిద్దుకోవడమే కాకుండా, రెటినోపతి వంటి తీవ్ర సమస్యలను నివారించవచ్చు. వ్యాధి వచ్చాక బాధపడటం కంటే.. రాకముందే గుర్తించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!
ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.