కర్డ్ రైస్ తో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్..
సాక్షి లైఫ్ : మనలో చాలా మంది లైట్ గా ఏదైనా తినాలనుకుంటే పెరుగు అన్నాన్ని ఎంచుకుంటారు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. దీనిని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా తింటారు. కానీ దానికి రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాలుండడంతో ఇప్పుడు దేశంలోనేకాదు ప్రపంచదేశాల్లో సైతం అనేక ప్రాంతాలలో ప్రజాదరణ పొందుతోంది. పెరుగన్నం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పలు పరిశోధనల్లో తేలడంతో చాలా మంది దీనిని తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుఅన్నం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెల్త్ బెనిఫిట్స్..
పెరుగుఅన్నంలో ఉండే పోషకాలు వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయి. పెరుగు అన్నం క్రమం తప్పకుండా తినడం వల్ల వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీ జీర్ణవ్యవస్థ, ప్రేగులను సురక్షితంగా ఉంచుతుంది.
ప్రోబయోటిక్స్..
జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి పెరుగు అన్నం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పేగులో ఉండే మంచి బ్యాక్టీరియా కూర్పును మెరుగతుంది. ప్రోబయోటిక్స్ జీర్ణ సంబంధిత సమస్యలను నిరోధించి, బలమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతును ఇస్తాయి.
ఎముకలు, దంతాలకు మేలు..
పెరుగులో ఉండే కాల్షియం మీ ఎముకలు, దంతాలకు చాలా ముఖ్యమైనది. కాబట్టి పెరుగు అన్నం తినడం వల్ల మీ ఎముకలు, దంతాలు బలంగా,ఆరోగ్యంగా ఉంటాయి.
బరువు తగ్గించడంలో..
మీరు మీ బరువును తగ్గించాలనుకుంటే, పెరుగుఅన్నం తీసుకోవడం మంచిది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. గట్ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలోనూ సహాయపడుతాయి.
పెరుగులో ఉండే ప్రోటీన్ ,కాల్షియం కంటెంట్ ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు శక్తిని పెంచుతాయి. పెరుగు అన్నాన్ని ఆరోగ్యకరమైన పోషకాలు అధికంగా ఉండే ఫుడ్ గా భావిస్తారు.
ఇది కూడా చదవండి.. తమిళనాడులో పీచుమిఠాయిని ఎందుకు నిషేధించారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
