సూర్యగ్రహణం డైరెక్ట్ గా చూస్తే కళ్లు దెబ్బతింటాయా..? 

షేర్ చేయండి:
సూర్యగ్రహణం డైరెక్ట్ గా చూస్తే కళ్లు దెబ్బతింటాయా..? 

సాక్షిలైఫ్ : సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ప్రత్యక్షంగా చూడడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా..? ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా గ్రహణం సమయంలో ఆయా దృశ్యాలను డైరెక్ట్ గా చూస్తే కళ్లు దెబ్బతింటాయని చాలామంది అంటుంటారు. వాస్తవంగా కంటి చూపుకు ఏమైనా ఇబ్బందా..? దీనిపై వైద్యనిపుణులు ఏమంటున్నారు..?

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

గత సోమవారం, ఏప్రిల్ 8, ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం (సూర్యగ్రహణం 2024) సంభవించింది. దీంతో పాటు ఈ గ్రహణం పట్ల ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే గ్రహణం పట్టినప్పటి నుంచి కంటి సమస్యలు తలెత్తుతాయా అనేదానిపై చాలామంది గూగుల్ లో వెతికారు. 

మళ్లీ 2026 వరకు..

భూమిపై ఇటువంటి ఖగోళ సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని,  అలాంటి దృశ్యం మళ్లీ 2026 వరకు కనిపించదని నాసా చెప్పడంతో జనాలు ఏప్రిల్ 8న సంభవించిన సూర్యగ్రహణాన్ని చూడడానికి ఆసక్తి చూపించారు. అయితే గ్రహణం సమయంలో కళ్లకు ఏమైనా హాని కలుగుతుందా..? అంటూ అందరూ గూగుల్‌ లో సెర్చ్ చేశారు.  

గ్రహణ సమయంలో.. 

సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో, చంద్రుడు భూమి ,సూర్యుని మధ్య వెళుతుంది. ఇది అరుదైన దృశ్యంగా భావిస్తారు. అలాంటి దృశ్యాలను చూడడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. 

గ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా కళ్లతో చూడకపోవడం మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎవరైనా కళ్లతో సూర్యుడిని చూడటానికి ప్రయత్నిస్తే అది కళ్లకు హాని కలుగుతుందని వారు అంటున్నారు. 

కళ్లకు సమస్య.. 

నేరుగా సూర్యుడిని చూడటం వల్ల దృష్టిలోపాలు తలెత్తడమేకాకుండా, తలనొప్పి, డిస్క్రోమాటోప్సియా, బ్లైండ్ స్పాట్, కాంతిని చూడలేకపోవడం వంటి సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..? 

సంపూర్ణ గ్రహణం సమయంలో కూడా, సూర్యుడు చంద్రుని పాక్షికంగా లేదా పూర్తిగా దాచినప్పుడు, సూర్యుని కిరణాలు చాలాతీవ్రంగా ఉంటాయని, అవి కళ్ళకు హాని కలిగిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సూర్యుడిని నేరుగా చూడటం వల్ల సోలార్ రెటినోపతి అనే పరిస్థితి ఏర్పడుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలు రెటీనాను దెబ్బతీయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.