గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6వతేదీన 10కె రన్
సాక్షి లైఫ్ : గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్6న హైదరాబాద్ నగరంలో క్వాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2024 పేరుతో క్యాన్సర్ అవేర్నెస్ రన్ ను నిర్వహించనున్నారు. ఇటీవలహోటల్ దస్‌పల్లాలో "క్వాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2024" కు సంబంధించిన టీ-షర్ట్, మెడల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యతిధులుగా తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క, ప్రముఖ హాస్యనటుడు అలీలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..పియర్స్ బరువును తగ్గిస్తాయా..?
ఇది కూడా చదవండి..మెడిసిన్స్ లేకుండా హైబీపీని తగ్గించే చిట్కాలు..?
ఇది కూడా చదవండి..హెమటోలాజిక్ క్యాన్సర్ అంటే ఏమిటి..?
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ చినబాబు పేరుకే 'చిన్న' అయినప్పటికీ, అతను చాలా 'పెద్ద పనులు' ,'గొప్ప' పనులు చేస్తున్నాడని ఆమె ఆయన సేవలను కొనియాడారు. ఈ రన్ అక్టోబర్ 6వతేదీన గచ్చిబౌలీ స్టేడియంలో జరుగుతుంది. ఈ 10కె రన్ ద్వారా ప్రజల్లో క్యాన్సర్ పై అవగాహన కల్పించడమే కాకుండా, పేదలకు చికిత్సల కోసం నిధులను సమకూర్చడం కోసం చేపట్టనున్నారు.
రన్ ఫర్ గ్రేస్ స్క్రీన్ ఫర్ లైఫ్..
“రన్ ఫర్ గ్రేస్ స్క్రీన్ ఫర్ లైఫ్” అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ రన్ 7వ ఎడిషన్‌లో 130కి పైగా దేశాల నుంచి లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొంటారని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ , గ్రేస్ (గ్లోబల్ రీసెర్చ్) వ్యవస్థాపకులు డా.చిన్నబాబు సుంకవల్లి వెల్లడించారు. 2కె, 5కె, 10కె అనే మూడు విభిన్న విభాగాల్లో ఈ రన్ జరగనుందని, గచ్చిబౌలిలో జరిగే ఈ ఈవెంట్‌లో 20వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందని రేస్ డైరెక్టర్ కృపాకర్ రెడ్డి వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవేర్నెస్ రన్ ఇది. దీనికోసం ఫిజికల్, వర్చువల్ ద్వారా 130 దేశాల నుంచి ఒకలక్ష మందికి పైగా పాల్గొనే ఈ రన్ అక్టోబర్ 6న గచ్చిబౌలిలో జరగనుంది.పేద ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌ను అమలు చేయడానికి నిధులను సేకరించేందుకు రన్ ను నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తప్పనిసరిగా ఈ ఆరు అవసరం..
ఇది కూడా చదవండి..ప్యాక్ చేసిన జ్యూస్‌లతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
