పియర్స్ బరువును తగ్గిస్తాయా..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన పండ్లలో చాలారకాలున్నాయి. వీటిలో ద్రాక్ష, ఆపిల్, నారింజ, బెర్రీస్ వంటి పండ్లకు ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అన్ని పండ్లలోనూ శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. అటువంటి పండ్లలో పియర్స్ ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండు తినడంవల్ల బరువు కూడా తగ్గవచ్చు.
ఇది కూడా చదవండి..Mpox Virus : మంకీపాక్స్‌కు సంబంధించిన అపోహలు..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఫైబర్..
పియర్స్ లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సరిగ్గా పని చేయించడంలో సహాయపడుతుంది. నిత్యం కడుపును శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
కాలరీలు తక్కువ..
పియర్స్ లో తక్కువ కాలరీలుంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అంతేకాదు బరువు పెరగకుండా ఉండేందుకు కడుపును నిండుగా ఉంచుతుంది. తద్వారా ఆకలి పెద్దగా అనిపించదు. కాబట్టి దీనిని తినడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు.
సమృద్ధిగా పోషకాలు..
పియర్స్ లో విటమిన్లు, మినరల్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. ఇందులో విటమిన్ "సి" కూడా లభిస్తుంది.
అధిక బరువు సమస్య..
పియర్స్ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే బరువు తగ్గించేందుకు మొత్తం ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం కూడా ముఖ్యమైనవి. పియర్స్ బరువుతగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటితో పాటు ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు పాటించడం, సరైన వ్యాయామం చేయడం కూడా అవసరం.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ప్యాక్ చేసిన జ్యూస్‌లతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
