ACS Major Updates : గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కొత్త మార్గదర్శకాలు ఇవే..!
సాక్షి లైఫ్ : గర్భాశయ క్యాన్సర్‌ను (Cervical Cancer) తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే స్క్రీనింగ్ పద్ధతుల్లో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ACS) తాజాగా కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్పులు రోగులకు మరింత సౌలభ్యాన్ని, పరీక్షలకు ఖచ్చితత్వాన్ని పెంచేలా రూపొందించారు. గతంలో స్క్రీనింగ్ ప్రారంభ వయస్సు 21 సంవత్సరాలు.. 25 సంవత్సరాలు ఇకపై 25 ఏళ్ల లోపువారికి అవసరం లేదు.
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ప్రధానంగా వచ్చిన మార్పులు (Key Changes) ఏమిటి.. ?
గతంలో స్క్రీనింగ్ ప్రారంభ వయస్సు 21 సంవత్సరాలు.. 25 సంవత్సరాలు ఇకపై 25 ఏళ్ల లోపువారికి అవసరం లేదు, పరీక్షలకు ప్రాధాన్యత (Preferred Test)HPV & Pap Test (Co-Testing) లేదా Pap Testప్రైమరీ HPV టెస్ట్ మాత్రమే..
3 లేదా 5 సంవత్సరాలు5 సంవత్సరాలకు ఒకసారి ప్రైమరీ హెచ్ పీవీ టెస్ట్ అయితే ఇంటివద్ద పరీక్షలేదు, స్వీయ-సేకరణకు ఆమోదం.
(Self-Collection for HPV Test) "సెల్ఫ్-కలెక్షన్"..
కొత్త మార్గదర్శకాలలో అత్యంత ముఖ్యమైన మార్పు ఇదే. సంప్రదాయ పద్ధతిలో క్లినిక్‌కు వెళ్లి డాక్టర్ ద్వారా నమూనా ఇవ్వడానికి ఇబ్బంది పడేవారు లేదా సౌకర్యం లేనివారి కోసం, యోని నమూనాలను (Vaginal Samples) మహిళలే సొంతంగా సేకరించి హెచ్ పీవీ టెస్ట్ చేయించుకోవడానికి అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇప్పుడు ఆమోదం తెలిపింది. దీనివల్ల పరీక్షలకు దూరంగా ఉంటున్న వారికి కూడా క్యాన్సర్ ముందస్తు గుర్తింపు మరింత సులభమవుతుంది.
డాక్టర్ ద్వారా సేకరించిన నమూనాలకే ఇప్పటికీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ, సెల్ఫ్-కలెక్షన్ ఒక ఆమోదయోగ్యమైన ఎంపికగా మారింది. సెల్ఫ్-కలెక్షన్‌లో నెగెటివ్ వస్తే, తదుపరి స్క్రీనింగ్ 3 సంవత్సరాలకు చేయించుకోవాలి.
స్క్రీనింగ్ ఎప్పుడు ఆపాలి (When to Stop Screening)..?
65 ఏళ్ల తర్వాత గత 10 సంవత్సరాలలో స్క్రీనింగ్ ఫలితాలు అన్నీ సాధారణంగా ఉన్నవారు, గత 25 సంవత్సరాలలో తీవ్రమైన క్యాన్సర్ పూర్వ దశ, CIN2 లేదా అంతకంటే తీవ్రమైనది, క్యాన్సర్ చరిత్ర లేనివారు 65 ఏళ్ల వయస్సు తర్వాత స్క్రీనింగ్‌ను నిలిపివేయవచ్చు.
25 నుంచి 65 సంవత్సరాల వయస్సు ఉంటే, వైద్యుడిని సంప్రదించి, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రైమరీ హెచ్ పీవీ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. హెచ్ పీవీ టెస్ట్ అందుబాటులో లేకపోతే, ప్రత్యామ్నాయంగా హెచ్ పీవీ, Pap టెస్ట్ (Co-Testing) ప్రతి ఐదేళ్లకు ఒకసారి, లేదా కేవలం Pap టెస్ట్ ప్రతి మూడేళ్లకు ఒకసారి చేయించుకోవచ్చు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్ పీవీ వ్యాక్సినేషన్ అత్యంత కీలకం.
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
