దేశంలో కరోనా ఉగ్రరూపం: భారీగా పెరుగుతున్న కేసులు..
సాక్షి లైఫ్ : దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత తొమ్మిది రోజుల్లో కోవిడ్-19 కేసులు ఏకంగా 1372 శాతం పెరిగి 3783కి చేరాయి. శనివారం నాటికి 511 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 255 మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
మే 22న దేశవ్యాప్తంగా 257 కేసులు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 3783కి చేరింది. రాష్ట్రాలవారీగా చూస్తే కేరళలో అత్యధికంగా 1400 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 485, ఢిల్లీలో 436 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత రెండు రోజుల్లో..
జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 28 కరోనా మరణాలు సంభవించగా, గత 2 రోజుల్లోనే 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్యలో మహారాష్ట్ర (7) అగ్రస్థానంలో ఉండగా, కేరళ (5), ఢిల్లీ (2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
