సీజనల్ వ్యాధులపై అవగాహన కరపత్రాల ఆవిష్కరణ..
సాక్షి లైఫ్ : సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖ రూపొందించిన కరపత్రాలను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనరసింహ ఆవిష్కరించారు. ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే, ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..కాలేయం, కిడ్నీ సమస్యలున్నప్పుడు కనిపించే 5 కీలక సంకేతాలు ఇవే..
ఇది కూడా చదవండి..హైపోథైరాయిడిజాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలి..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఒకవేళ సీజనల్ వ్యాధుల బారిన పడితే, ప్రభుత్వ దవాఖానాల వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ప్రభుత్వ దవాఖానాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ ఫణీంద్ర రెడ్డి, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, పబ్లిక్‌హెల్త్ అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయల్, జాయిట్ డైరెక్టర్ శివబాలాజీ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..హైపోథైరాయిడిజం ఉన్నవారు దూరంగా ఉండాల్సినవి/మితంగా తీసుకోవాల్సినవి..
ఇది కూడా చదవండి..సైనసైటిస్‌తో బాధపడుతున్నారా? అలర్జీలు రాకుండా ఇలా చేయండి..!
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
