కాలేయం, కిడ్నీ సమస్యలున్నప్పుడు కనిపించే 5 కీలక సంకేతాలు ఇవే..
సాక్షి లైఫ్ : మన ముఖం మన శరీర అంతర్గత ఆరోగ్యానికి అద్దం లాంటిదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో జరిగే ఆరోగ్యపరమైన మార్పులను ముందే గుర్తించే అవకాశం ముఖం ద్వారా లభిస్తుందని వారు చెబుతున్నారు. మీరు మీ ముఖంలో ఈ 5 ముఖ్య సంకేతాలను గమనిస్తే వెంటనే అప్రమత్తమై జాగ్రత్త పడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
కళ్ల కింద నలుపు వలయాలు..
కేవలం నిద్రలేమి వల్లే కాకుండా, డయాబెటీస్, ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) లేదా అలర్జీల కారణంగానూ కన్నుల కింద నలుపు వలయాలు రావొచ్చు. ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోవడం, బ్లడ్ షుగర్ లెవెల్స్ (రక్తంలో చక్కెర స్థాయిలు) ను ఎప్పటికప్పుడు చెక్ చేయించడం అత్యవసరం.
కన్నుల కింద వాపు..
శరీరంలో నీరు నిలవడం (ఫ్లూయిడ్ రిటెన్షన్), అధికంగా ఉప్పు తినడం, డీహైడ్రేషన్ (నిర్జలీకరణం), హార్మోన్ల మార్పులు, లేదా కిడ్నీ ఫంక్షన్ (మూత్రపిండాల పనితీరు) బలహీనత వల్ల కన్నుల కింద వాపు ఏర్పడుతుంది. ఈ వాపు ఎక్కువ రోజులు కొనసాగితే వెంటనే కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవడం అవసరం.
నోటి వద్ద చీలికలు..
విటమిన్-బి12 లోపం వల్ల నోటి మూలలు చీలిపోయే సమస్య (యాంగ్యులర్ చీలిటిస్) వస్తుంది. దీని నివారణకు ఆకుకూరలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, మాంసాహారం వంటి బి12 పుష్కలంగా లభించే ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.
కళ్లకు ఎర్రటి వలయాలు..
లివర్ సమస్యలు (కాలేయ సమస్యలు), అధికంగా మద్యం సేవించడం, లేదా ఎక్కువసేపు స్క్రీన్ (టీవీ, కంప్యూటర్, ఫోన్) చూసే అలవాటు వల్ల కళ్లకు ఎర్రటి వలయాలు రావచ్చు. మీ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మద్యం సేవనాన్ని తగ్గించుకోవడం తక్షణావశ్యకం.
తరచుగా మొటిమలు రావడం..
తరచుగా మొటిమలు (పింపుల్స్) రావడం కేవలం ముఖానికి సంబంధించిన సమస్య కాదని, అది మీ గట్ హెల్త్ (జీర్ణవ్యవస్థ ఆరోగ్యం) సమస్యకు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను ఆహారంలో చేర్చడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. వైద్య నిపుణులను సంప్రదించి, సరైన నిర్ధారణ, చికిత్స పొందడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
