అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..
సాక్షి లైఫ్ : ఇటీవల చైనాలో వెట్‌ల్యాండ్ వైరస్ కేసులు తీవ్రంగా ఆందోళన కలిగిస్తుండగా, మరోపక్క అమెరికాలో కూడా, టిక్ కాటు ద్వారా వ్యాపించే ఒక వ్యాధి వేగంగా ప్రబలుతోంది. బేబీసియోసిస్ అనే వ్యాధి అమెరికాలోని ప్రజలను వణికిస్తోంది. కరోనా తర్వాత ప్రపంచదేశాలల్లో అనేకరకాల కొత్త వైరస్ లు వస్తూనే ఉన్నాయి. వెట్ ల్యాండ్ వైరస్, జికా వైరస్, మంకీ పాక్స్, చాందీపూరా వైరస్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు డేంజర్
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
మెదడుపై నేరుగా ప్రభావం..
బేబీసియోసిస్ అనే వ్యాధి బాధితుల మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అమెరికాలో పలు ప్రాంతాల్లో బేబీసియోసిస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఇది అరుదైన వ్యాధి, ఇది ప్రధానంగా పేలు ఆకృతిలో ఉన్న పురుగు కాటు ద్వారా వ్యాపిస్తుంది.
అనేక రకాల బాబేసియా పరాన్నజీవులు బేబీసియోసిస్ వ్యాధికి కారణమవుతాయి. బాబేసియా ప్రోటోజోవా అనేవి మైక్రోస్కోప్ లేకుండా చూడలేని ఏకకణ జీవులు. వీటి కాటు ద్వారా రక్తంలోకి ప్రవేశించి, ఆపై ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తాయి. ఒక వేళ ఈ వ్యాధి తీవ్రమైతే కొన్ని సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్ ప్రాణాంతకం కూడా కావచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
