న్యూ స్టడీ: స్లీప్ అప్నియా ఔషధం మరో రెండు సమస్యలకూ ఉపయోగకరం

షేర్ చేయండి:
న్యూ స్టడీ: స్లీప్ అప్నియా ఔషధం మరో రెండు సమస్యలకూ ఉపయోగకరం

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా 9కోట్ల 36లక్షల మంది ప్రజలను అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ) ఔషధం అధిక బరువును తగ్గించడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ మంచి పనితీరు కనబరుస్తోందని ఇటీవల జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఓఎస్ఏ పరిస్థితిని సమర్థవంతంగా చికిత్స చేయగలిగిన మొదటి ఔషధం ఇది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడేవారికి ఇది నిద్ర నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుందని కూడా ఈ ఔషధం నిరూపించింది. 

 ఇది కూడా చదవండి..డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ల కౌంట్ ను ఎలా పెంచాలి..? 

పరిశోధనలో భాగంగా..  

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, బరువు సమస్యలతో బాధపడే 469 మంది పాల్గొన్నారు. పరిశోధనలో భాగంగా నిద్ర , జీవన నాణ్యతను మెరుగుపరచడానికి టిర్జెపటైడ్‌ను ఉపయోగించడాన్ని పరీక్షించారు. మౌంజరో, జెప్‌బౌండ్ బ్రాండ్ పేర్లతో ఈ ఔషధాన్ని విక్రయించారు. ఈ ఔషధం టైప్ 2 డయాబెటిక్, ఊబకాయం వంటి చికిత్సలో బాగా పనిచేసినట్లు అధ్యయనంలో వెల్లడైంది. 

శ్వాసకోశ, జీవక్రియ సమస్యలు..  

"ఈ అధ్యయనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా చికిత్సలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది శ్వాసకోశ , జీవక్రియ సమస్యలను పరిష్కరించే మంచి చికిత్స" అని కాలిఫోర్నియా శాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ ప్రొఫెసర్, డైరెక్టర్, ప్రధాన రచయిత అతుల్ మల్హోత్రా అన్నారు.

అమెరికా, ఆస్ట్రేలియాతో సహా తొమ్మిది దేశాల నుంచి కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరందరికీ  తీవ్రమైన  అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతోపాటు స్థూలకాయం వంటివి కూడా ఉన్నాయి. కొందరు క్రమం తప్పకుండా CPAP యంత్రాన్ని ఉపయోగించారు. మరికొందరు వారి నిద్ర రుగ్మతకు ఎటువంటి చికిత్స తీసుకోలేదు.

ఈ పరిశోధనలో పాల్గొన్నవారు ప్రతి వారం10 mg లేదా 15 mg టిర్జెపటైడ్‌ను ఇంజెక్షన్ లేదా ప్లేసిబో ద్వారా స్వీకరించారు. అనంతరం వీరిని 52 వారాల పాటు పర్యవేక్షించారు. సంవత్సరం చివరిలో ఈ  ఔషధం రాత్రి సమయంలో శ్వాస సంబంధిత సమస్యలను గణనీయంగా తగ్గించిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 

అధిక బరువు సమస్యలు..

ఈ ఫలితాలు శాస్త్రవేత్తలకు పూర్తి ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే అధిక బరువు సమస్యలు ఉన్నవారిలో OSA చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడం వల్ల నిద్ర ఆటంకాలు తగ్గుతాయి. అయినప్పటికీ, తిర్జెపటైడ్ కేవలం బరువును మాత్రమేకాదు వారి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. OSA బాధితులకు గుండె జబ్బులు , రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల, ఈ చికిత్స ఇప్పటికే ఉన్న స్లీప్ అప్నియా చికిత్స ఎంపికల కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందని పరిశోధకులు తేల్చారు. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి.. పీరియడ్స్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.