Viruses Are Spreading Again : మళ్ళీ విజృంభిస్తున్న వైరస్లు.. లక్షణాలు ఒకటే, వ్యాధులే వేరు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా విష జ్వరాలు, శ్వాసకోస వ్యాధులు కలవరపెడుతున్నాయి. అటు కరోనా కొత్త వేరియంట్లు, ఇటు ఇన్‌ఫ్లుయెంజా (Influenza) విరుచుకుపడుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం అమెరికా సహా పలు దేశాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ 'BA.3.2' (Cicada) సికాడా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

తేల్చుకోలేకపోతున్న బాధితులు..!

జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వరం.. ఇవి ఏ వైరస్ సోకినా కనిపించే సాధారణ లక్షణాలు. పూర్వం కోవిడ్ సోకితే రుచి, వాసన కోల్పోయే వారు. కానీ, ఇప్పుడు వస్తున్న వేరియంట్లలో అటువంటి స్పష్టమైన తేడాలేమీ లేవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకుంటే తప్ప అది ఫ్లూనా లేక కరోనానా అన్నది తేలడం లేదని జాన్ హాప్‌కిన్స్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

'సికాడా' వేరియంట్ ప్రమాదకరమా..?

ప్రస్తుతం చాపకింద నీరులా విస్తరిస్తున్న BA.3.2 (Cicada) వేరియంట్ గత వేరియంట్ల కంటే భిన్నమైన మ్యుటేషన్లను కలిగి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని సైతం తప్పించుకోగలదని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కేసులు స్వల్పంగానే ఉన్నాయని, భారీ స్థాయిలో ముప్పు పొంచి ఉందనడానికి ఆధారాలు లేవని నిపుణులు ఊరటనిస్తున్నారు.

అనారోగ్య సమస్యలు.. 

కోవిడ్ (BA.3.2).. రోగనిరోధక శక్తిని సవాలు చేసే కొత్త వేరియంట్ సికాడా.

ఇన్‌ఫ్లుయెంజా A (H3N2)..తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పితో వేధిస్తోంది.

RSV (ఆర్.ఎస్.వి).. చిన్న పిల్లల్లో, వృద్ధుల్లో శ్వాసకోస ఇబ్బందులకు కారణమవుతోంది.

ఉదర సంబంధిత వైరస్లు .. వాంతులు, విరేచనాలకు కారణమవుతున్న 'స్టమక్ బగ్'.

ఏం చేయాలి..?

స్థానికంగా ఉన్న మురుగునీటి పరీక్షలు ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఏ వైరస్ ఎక్కువగా ఉందో అధికారులు గుర్తిస్తున్నారు. ఫ్లోరిడా, మసాచుసెట్స్ వంటి చోట్ల కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. "పరిస్థితి మరీ ఆందోళనకరంగా లేకపోయినా.. జాగ్రత్తలు పాటించడం ఉత్తమం" అని బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. మీకు జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే.. సొంత వైద్యం చేసుకోకుండా తక్షణమే డాక్టరును సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.