UV Rays in Hyderabad : బీకేర్ ఫుల్..! : హైదరాబాద్‌ లో అత్యంతప్రమాదకర స్థాయిలో యువీ రేస్.. నగర వాసులకు స్కిన్ క్యాన్సర్ ముప్పు.. 

సాక్షి లైఫ్ : హైదరాబాద్‌లో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, అతినీలలోహిత (Ultraviolet rays) కిరణాల ప్రభావంపై వైద్యులు హెచ్చరిస్తున్నారు.   తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. కేవలం ఉష్ణోగ్రతలే కాదు, సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత (UV) కిరణాల తీవ్రత కూడా ప్రమాదకర స్థాయికి చేరుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఎండ తీవ్రతను బట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ యూవీ కిరణాల ప్రభావం మనకు తెలియకుండానే చర్మంపై పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?

 

యూవీ ఇండెక్స్ అంటే ఏమిటి..?

సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల తీవ్రతను కొలిచే ప్రమాణమే యూవీ ఇండెక్స్. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఈ ఇండెక్స్ 10 నుంచి 12 మధ్య నమోదవుతోంది. ఇది 'అత్యంత ప్రమాదకర' (Extreme) స్థాయిగా వైద్యులు పరిగణిస్తారు. వాతావరణ బులెటిన్లలో ఈ ఇండెక్స్ వివరాలు లేకపోవడం వల్ల చాలామంది దీని తీవ్రతను గుర్తించలేకపోతున్నారు.

చర్మంపై తీవ్ర ప్రభావం..

సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్-డి శరీరానికి అవసరమే అయినప్పటికీ, మితిమీరిన ఎండ వల్ల చర్మంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చర్మం కమిలిపోవడం (Sunburn), ముడతలు పడటం, అకాల వృద్ధాప్యం వంటివి తలెత్తుతాయి. దీర్ఘకాలం పాటు ఈ కిరణాలకు గురైతే చర్మ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంటుందని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. నేరుగా సూర్యుడిని చూడటం వల్ల కంటి చూపు మందగించే అవకాశం ఉంది. 

ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?  

ఎండ ప్రభావం నుంచి కాపాడుకోవడానికి వైద్యులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకపోవడమే శ్రేయస్కరం. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. తలకు టోపీ లేదా స్కార్ఫ్ కట్టుకోవాలి. ఎండలోకి వెళ్లే 20 నిమిషాల ముందు కనీసం SPF 15 అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్లను రాసుకోవాలి.


కళ్లకు నాణ్యమైన సన్‌గ్లాసెస్ UVA/UVB రక్షణ ఇచ్చేవి వాడాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి రోజుకు కనీసం 3,4 లీటర్ల నీరు తాగాలి. ఎండ తక్కువగా ఉన్నట్టు అనిపించినా, యూవీ కిరణాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి మేఘావృతమై ఉన్నా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : skin-cancer skin-problems hyderabad skin-infection uv-light uv-radiation uv-exposure
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com