Telangana DCA Issues Alert: పిల్లల కాఫ్ సిరప్‌లతో జాగ్రత్త.. ! తెలంగాణ DCA అలర్ట్ 

షేర్ చేయండి:
Telangana DCA Issues Alert: పిల్లల కాఫ్ సిరప్‌లతో జాగ్రత్త.. ! తెలంగాణ DCA అలర్ట్ 

సాక్షి లైఫ్ : సాక్షి లైఫ్ : చిన్నపిల్లలకు వాడే కొన్ని రకాల దగ్గు, జలుబు సిరప్‌ల విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) హెచ్చరించింది. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో కొన్ని మందుల్లో ప్రాణాంతకమైన రసాయనాలు ఉన్నట్లు తేలడంతో అధికారులు వాటిని వాడకుండా నిషేధించారు. అందుకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు.

 

 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?

ఏమిటీ రసాయనాలు..? ఎందుకు ప్రమాదం అంటే..?

సాధారణంగా సిరప్‌ల తయారీలో ద్రావకాలుగా వాడే గ్లిజరిన్, ప్రొపిలిన్ గ్లైకాల్ వంటి వాటిలో కలుషితాలు చేరినప్పుడు అవి విషపూరితంగా మారుతాయి. ఇథిలీన్ గ్లైకాల్ (EG) ఇది శరీరంలోకి చేరితే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. డై ఇథిలీన్ గ్లైకాల్ (DEG).. దీనివల్ల వాంతులు, విరేచనాలు, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు.

హెచ్చరిక జాబితాలో ఉన్న మందులు ఇవే..

ఆల్మాంట్-కిడ్ (Almont-Kid).. ఇందులో అనుమతించదగిన స్థాయి కంటే ఎక్కువ మోతాదులో ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు గుర్తించారు. కోల్డ్‌రిఫ్ (Coldrif)..గతంలోనే దీనిపై నిషేధం విధించారు. రెలిఫ్ (Relife), రెస్పిఫ్రెష్ టీఆర్ (Respifresh TR)..ఈ బ్యాచ్‌లలోనూ నాణ్యతా లోపాలు ఉన్నట్లు వైద్యశాఖా అధికారులు గుర్తించారు.

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండండి.. 

వైద్యుల సలహా తప్పనిసరి.. సొంత వైద్యం అస్సలు వద్దు. డాక్టర్ రాసిచ్చిన మందులనే వాడాలి. బ్యాచ్ నంబర్ చెక్ చేయండి.. కొనేముందు మందు సీసాపై బ్యాచ్ నంబర్, గడువు తేదీ (Expiry Date) తప్పక చూడాలి. సిరప్ వేసిన తర్వాత పిల్లల్లో విపరీతమైన మత్తు, వాంతులు లేదా మూత్ర విసర్జనలో ఇబ్బందులు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. నాణ్యత లేని మందులను గురించి  సమాచారం ఉంటే వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారుల టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయవచ్చు.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.