Cancer vaccine : నా కుమారుడిపై క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోగించండి.. రష్యా ప్రభుత్వానికి యూపీ తండ్రి విజ్ఞప్తి..!

షేర్ చేయండి:
Cancer vaccine : నా కుమారుడిపై క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోగించండి.. రష్యా ప్రభుత్వానికి యూపీ తండ్రి విజ్ఞప్తి..!

సాక్షి లైఫ్ : ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోకు చెందిన ఒక తండ్రి తన 21 ఏళ్ల కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రపంచంలోని అత్యున్నత ప్రభుత్వాలకు లేఖలు రాసి చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సంచలనంగా మారింది. లక్నో వాసి మను శ్రీవాస్తవ కుమారుడు అన్ష్ శ్రీవాస్తవ ప్రస్తుతం నాల్గవ దశ క్యాన్సర్‌తో (Stage 4 Cancer) పోరాడుతున్నాడు. రష్యా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ 'ఎంటెరోమిక్స్' (Enteromix) ప్రయోగాలను (Clinical Trials) తన కుమారుడిపై చేయాలని కోరుతూ ఆయన రష్యా ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి లేఖలు రాశారు.

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

 తండ్రి ఆవేదన.. 

మను శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడికి ఇక్కడ చికిత్స అందిస్తున్నప్పటికీ, వ్యాధిపై పూర్తి భరోసా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాలో క్యాన్సర్‌కు ఒక కొత్త వ్యాక్సిన్‌ను కనుగొన్నారని, అది క్యాన్సర్ కణితి (Tumour) పెరుగుదలను 60శాతం నుంచి 80శాతం వరకు తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తోందని తెలిసి, ఇదే తమకు చివరి ఆశగా అనిపిస్తోందని తెలిపారు. అంతేకాదు దీనిపై ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య మంత్రి, రష్యాలోని సీనియర్ అధికారులకు లేఖలు రాశారు.

తాము ఎదురుచూస్తున్న ఆ క్యాన్సర్ వ్యాక్సిన్ 'ఎంటెరోమిక్స్' mRNA-ఆధారిత చికిత్స అని, ఇది వ్యక్తిగతంగా ప్రతి రోగి కణితి జన్యువుల ఆధారంగా తయారవుతుందని సమాచారం.

 రష్యా ప్రభుత్వ స్పందన..  

తండ్రి మను శ్రీవాస్తవ విజ్ఞప్తికి రష్యా ప్రభుత్వం సున్నితంగా స్పందించింది. రష్యాలోని ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ రష్యా నుంచి ఆయనకు అధికారిక లేఖ అందింది.

ప్రభుత్వ ప్రకటన..  

"మీ అభ్యర్థనను రష్యా ప్రభుత్వ కార్యాలయం పరిశీలించింది. తదుపరి విచారణ నిమిత్తం దీనిని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు (Russian Ministry of Health) పంపాము" అని ఆ లేఖలో పేర్కొన్నట్లు శ్రీవాస్తవ తెలిపారు.

భారత ప్రభుత్వ సమాధానం..  

 భారత ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలో, ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం రష్యాలో మాత్రమే తయారు చేసి, అక్కడే స్థానికంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని, ఈ ట్రయల్స్ నిర్వహించడానికి భారతదేశానికి లేదా ఇతర ఏ దేశానికి ఇంకా అనుమతులు రాలేదని స్పష్టం చేసినట్లు మను శ్రీవాస్తవ వివరించారు.

ప్రస్తుతం, రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం కోసం శ్రీవాస్తవ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. ఒకవేళ అనుమతి లభిస్తే, ఈ ట్రయల్‌లో పాల్గొనే తొలి భారతీయుడిగా అన్ష్ నిలిచే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.