Sale of Weight Loss Drugs : మార్కెట్లోకి బరువు తగ్గించే' మందుల విక్రయాలపై కేంద్రం నిఘా..
సాక్షి లైఫ్ : దేశీయ మార్కెట్లో గ్లూకాగాన్ వంటి పెప్టైడ్-1 (GLP-1) జనరిక్ ఔషధాల లభ్యత పెరగడం, ధరలు భారీగా తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మధుమేహం, ఊబకాయం నియంత్రణకు వాడే ఈ మందులు ఇష్టానుసారంగా దుర్వినియోగం అవుతుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన 49 వ్యాపార సంస్థలపై తనిఖీలు చేపట్టి, షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి..
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను వాడటం ప్రాణసంకట మని ప్రభుత్వం హెచ్చరించింది. భారత్‌లో ఈ మందులను కేవలం ఎండోక్రైనాలజిస్టులు, జనరల్ మెడిసిన్ నిపుణులు, కార్డియాలజిస్టులు వంటి వారు మాత్రమే సూచించాల్సి ఉంటుంది.
విచ్చలవిడిగా విక్రయాలు.. కఠిన చర్యలు..
ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారమ్‌లు, వెల్‌నెస్ క్లినిక్‌లు, రిటైల్ మందుల షాపుల్లో ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇవి దొరుకుతున్నట్లు అధికారులు గుర్తించారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించే సంస్థలపై లైసెన్సుల రద్దు, జరిమానాలు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) హెచ్చరించింది.
ముంచుకొస్తున్న ముప్పు..!
అతిగా లేదా అనవసరంగా ఈ ఔషధాలను వాడటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాంతులు, క్లోమ గ్రంథి వాపు, కిడ్నీ సంబంధిత సమస్యలు, పేగు సంబంధిత అడ్డంకులు (Bowel obstruction) ఏర్పడే అవకాశం ఉంది.
తక్కువ ధరకే లభిస్తున్నాయని సొంతంగా వైద్యం చేసుకోవడం ముప్పును కొనితెచ్చుకోవడమేనని, ఏదైనా ఔషధాన్ని వాడే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలని ప్రభుత్వం తన అడ్వైజరీలో స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
