ఢిల్లీలో మళ్లీ కరోనా కలకలం : దేశవ్యాప్తంగా వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు.. 

షేర్ చేయండి:
ఢిల్లీలో మళ్లీ కరోనా కలకలం : దేశవ్యాప్తంగా వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు.. 

సాక్షి లైఫ్ : దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్-19 మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత వారం రోజుల్లో ఢిల్లీ పరిధిలో వందకు పైగా కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్ మళ్లీ పుంజుకోవడంతోప్రజల్లో ఆందోళన మొదలైంది.

 

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

దేశవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి చేరింది. ఇందులో ఢిల్లీలోనే 104 యాక్టివ్ కేసులు ఉండగా, గత వారం రోజుల్లోనే 99 కేసులు నమోదవడం గమనార్హం.

 ఏడుగురు మృతి.. 

మహారాష్ట్ర: 4 మృతి 
కేరళ: 2  మృతి
కర్ణాటక: 1 మృతి

అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.