Ebola Virus in Africa : ఆఫ్రికాలో ఎబోలా వైరస్ పంజా.. కాంగోలో 336 కేసులు, 88కి చేరుకున్న మరణాల సంఖ్య..!
సాక్షి లైఫ్ : ఆఫ్రికా ఖండంలో ఎబోలా మహమ్మారి సృష్టిస్తోన్న అలజడి రోజురోజుకూ ముదురుతోంది. ఆఫ్రికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు, ఆఫ్రికా సీడీసీ తాజాగా విడుదల చేసిన గణాంకాలు అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ) తూర్పు ప్రావిన్స్, దాని పరిసర ప్రాంతాలలో ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఈ ప్రాంతంలో ఇప్పటికే 336 అనుమానాస్పద కేసులు వెలుగుచూడగా, వారిలో 88 మంది చిన్నారులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తి రేటు, మరణాల తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచినప్పటికీ, కేసుల సంఖ్య ఈ స్థాయిలో నమోదు కావడం అంతర్జాతీయ వైద్య నిపుణులను సైతం కలవరపెడుతోంది.
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
