కస్టమర్లను తప్పుదారి పట్టించవద్దని ఈ-కామర్స్ కంపెనీలను హెచ్చరించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
సాక్షి లైఫ్ : పాడిపరిశ్రమ ఆధారిత, తృణధాన్యాల ఆధారిత పానీయాలను 'హెల్త్ డ్రింక్' లేదా 'ఎనర్జీ డ్రింక్' అని నిర్ధారించి అమ్మవద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అన్ని ఈ-కామర్స్ కంపెనీలను ఆదేశించింది. ఎందుకంటే దేశంలోని ఆహార చట్టాలలో 'హెల్త్ డ్రింక్' అనే పదం నిర్వచించలేదు. 'ఎనర్జీ డ్రింక్' అనేది చట్టాల ప్రకారం కార్బోనేటేడ్ , నాన్-కార్బోనేటేడ్ రెండింటినీ ఫ్లేవర్డ్ వాటర్ ఆధారిత పానీయాలను ప్రత్యేకంగా సూచిస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.
కేటగిరీల నుంచి..
తప్పుడు నిబంధనలను ఉపయోగించి వినియోగదారులను తప్పుదారి పట్టించవద్దని, 'హెల్త్ డ్రింక్స్,ఎనర్జీ డ్రింక్స్' కేటగిరీల నుంచి అటువంటి పానీయాలను తొలగించడం ద్వారా దీనిని సరిచేయాలని అన్ని ఈ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్‌లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది.
ఎనర్జీ డ్రింక్స్ అనే పదం..
'హెల్త్ డ్రింక్' అనే పదం FSS చట్టం 2006 లేదా ఆహార పరిశ్రమను నియంత్రించే దాని నియమాలు, నిబంధనల ప్రకారం నిర్వచించలేదు లేదా ప్రమాణీకరించలేదు అని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. 'ఎనర్జీ డ్రింక్స్' అనే పదం కార్బోనేటేడ్ , నాన్-కార్బోనేటేడ్ వాటర్ బేస్డ్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ వంటి ఉత్పత్తులపై మాత్రమే ఉపయోగించడానికి అనుమతించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ తెలిపింది.
ఇది కూడా చదవండి.. ఎండాకాలంలో ఈ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికలిగిస్తాయని మీకు తెలుసా..?
పారదర్శకత..
"ఈ దిద్దుబాటు చర్య ఉత్పత్తుల స్వభావం, క్రియాత్మక లక్షణాలకు సంబంధించి స్పష్టత, పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఎఫ్ఎస్ఎస్ఏఐ. వినియోగదారులను తప్పుదారి పట్టించే సమాచారం కాకుండా ఆయా డ్రింక్స్ తయారీలో ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ ను గురించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని "ఎఫ్ఎస్ఎస్ఏఐ కోరింది.
50 శాతం నుంచి 55శాతం..
ప్రముఖ డ్రింక్స్ తయారీ సంస్థలు నాలుగింట ఒక వంతుకు ఎనర్జీ డ్రింక్స్ విక్రయిస్తున్నాయి. కిరాణా దుకాణాల్లో విక్రయించడం ద్వారా వాటిని విస్తృతంగా అందుబాటులో ఉంచారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం.. పరిశోధకుడైన నీల్సన్‌ఐక్యూ డేటా ఆధారంగా ఎనర్జీ డ్రింక్ అమ్మకాలు ఏటా 50 శాతం నుంచి 55శాతం చొప్పున పెరుగుతున్నాయి.
ఆరోగ్యంపై ప్రభావం..
ముఖ్యంగా యువతలో ఎనర్జీ డ్రింక్స్ వినియోగం పెరుగుతున్నాయని, దీని కారణంగా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అధ్యయ నాలు సూచిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఇది కూడా చదవండి.. ఆటిజం ఉన్న చిన్నారులతో ఎలా ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
