ఆటిజం ఉన్న చిన్నారులతో ఎలా ఉండాలి..?  

సాక్షి లైఫ్ : "ఆటిజమ్ ".. దీనినే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్  అని కూడా అంటారు. ఇది నాడీ సంబంధిత సమస్య. ఇది 2 లేదా 3 సంవత్సరాల వయస్సులో గుర్తించవచ్చు. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు ఇతర పిల్లల వలె వెంటనే స్పందించలేరు, కమ్యూనికేట్ చేయలేరు. ముఖ్యంగా మాట్లాడటం, రాయడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. ఈరోజు ప్రపంచ ఆటిజం డే సందర్భంగా సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం..  

 ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..   


ఆటిస్టిక్ పిల్లలకు భిన్నమైన సామర్థ్యాలు, అవసరాలు ఉంటాయి. ఈ పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆటిజం ఉన్న పిల్లలు సాధారణ పిల్లలలాగా తమ ఆలోచనలను, భావాలను వ్యక్తం చేయలేరు. పలుమార్లు మాట్లాడాలని ఒత్తిడి తెచ్చినా వారికి కోపం వస్తుంది. ఇక్కడ తల్లిదండ్రులు సహనం పాటించాలి. వారి కోపాన్ని ప్రేరేపించే కారకాలను గుర్తించండి ,కోపాన్ని సురక్షితమైన మార్గంలో ఎలా తగ్గించాలో ఆయా మార్గాల ద్వారా వారిని అదుపు చేయండి. 

ఆటిస్టిక్ పిల్లల కోపానికి కారణాలు.. 

ఆటిజం ఉన్న పిల్లవాడు తన ఆలోచనలను, భావోద్వేగాలను ఇతరులకు తెలియజేయలేనప్పుడు, అది అతనికి కోపం తెప్పిస్తుంది.

ఆటిస్టిక్ పిల్లలు నిర్ణీత దినచర్యను అనుసరిస్తారు. కాబట్టి దానిలో ఏదైనా మార్పు వారికి కోపం తెప్పిస్తుంది.

 పిల్లలు హైపర్యాక్టివ్‌గా ఉన్నట్లయితే, వారిని నియంత్రించాలని చూస్తే కోపం రావచ్చు.

పిల్లలు అలసిపోయినప్పుడు లేదా బలహీనంగా అనిపించినప్పుడు, వారు కూడా కోపంగా ఉంటారు.

కోపంతో ఉన్న పిల్లలతో ఎలా ఉండాలి..?  

ఆటిజంతో బాధపడేవారి సమస్యలను గుర్తించండి.. ముఖ్యంగా వాళ్లకు  కోపం తెప్పించే విషయాలను గుర్తించడానికి ప్రయత్నించండి, అప్పుడే మీరు వారిని శాంతింపజేయడానికి మార్గాలను కనుగొనడానికి అవకాశం ఉంటుంది. తిట్టడం, బలవంతం చేయడం, దినచర్యలో మార్పులపై నిఘా ఉంచండి.

సాధారణ పదాలు ఉపయోగించండి

పిల్లలకు వివరించడానికి, బోధించడానికి ఎప్పుడూ సరళమైన, సృజనాత్మక పద్ధతులను ఉపయోగించండి. దీనితో మీరు వారికి పెద్ద పెద్ద విషయాలను కూడా సులభంగా వివరించవచ్చు. ఆటిస్టిక్ పిల్లల విషయంలో ఇది మరింత ముఖ్యమైనది. ఇందులో మీరు పజిల్స్ లేదా ఇతర ఆటల ద్వారా కూడా వారికి చెప్పవచ్చు.

విజయాన్ని మెచ్చుకోండి.. 

ఆటిస్టిక్ పిల్లల కోపాన్ని శాంతపరచడానికి మీరు అనుసరించిన పద్దతిని పిల్లవాడు అనుసరిస్తుంటే, అతన్ని ప్రశంసించండి. ఇది అతని మనోధైర్యాన్ని పెంచుతుంది.

 కోపాన్ని తగ్గించండి

వారి కోపాన్ని వెళ్లగక్కేందుకు వారికి సురక్షితమైన స్థలం ఇవ్వండి. మీరు ఇంట్లో మృదువైన బొమ్మను ఉంచి తన కోపాన్ని వెళ్లగక్కేందుకు వీటిని ఎలా ఉపయోగించాలో కూడా చెప్పండి.

 ఇది కూడా చదవండి.. నేడు వరల్డ్ ఆటిజం అవేర్ నెస్ డే సందర్భంగా.. స్పెషల్ స్టోరీ..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health-care kids world-autism-awareness-day-2024 world-autism-awareness-day autism-awareness-day-2024 world-autism-day-2024 autism-awareness-day autism autism-children autism-kids autistic-childs autistic-kids

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com