Good News for Heart Attack Patients : గుండెపోటు రోగులకు గుడ్‌న్యూస్..! రూ.40 వేల విలువైన ఇంజెక్షన్ ఇక ఉచితం.. 

షేర్ చేయండి:
Good News for Heart Attack Patients : గుండెపోటు రోగులకు గుడ్‌న్యూస్..! రూ.40 వేల విలువైన ఇంజెక్షన్ ఇక ఉచితం.. 

సాక్షి లైఫ్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుండెపోటు బాధితులకు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.40వేల నుంచి రూ.50వేల  ఖరీదు చేసే ఇంజెక్షన్ ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించనుంది. ఈ ఇంజెక్షన్ అందుబాటులోకి రావడం ద్వారా గుండెపోటు మరణాలను తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులు, ముఖ్యమైన సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (CHCs) కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

 

ఇది కూడా చదవండి..Track Diabetes Smartly : డయాబెటీస్ ను స్మార్ట్‌గా ట్రాక్ చేయండి.. ఆరోగ్యంగా జీవించండి..! 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గుండెపోటు మరణాలను తగ్గించడానికి, పేద రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి ఆరోగ్య శాఖ ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. గుండెపోటు సంభవించినప్పుడు అత్యవసరంగా ఉపయోగించే ఈ ఖరీదైన ఇంజెక్షన్‌ను సాధారణంగా టెనెక్టెప్లేజ్ లేదా స్ట్రెప్టోకైనేజ్ వంటివి అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాలలో ఉచితంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

పేదలకు ఉపశమనం.. 

ప్రైవేట్ మార్కెట్‌లో దీని ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది రోగులు ఈ ఇంజెక్షన్‌ను కొనుగోలు చేయలేకపోతున్నారు, ఫలితంగా చికిత్సలో ఆలస్యం జరిగి ప్రాణాపాయం సంభవిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ ఉచితంగా లభ్యం కావడం వల్ల, ఆర్థిక భారం మోపకుండానే ప్రాణాలను రక్షించే సౌకర్యం పేద రోగులకు అందుబాటులోకి వస్తుంది.

 గోల్డెన్ అవర్ కీలకం..  

గుండెపోటు వచ్చిన మొదటి గంట (Golden Hour) చికిత్సలో అత్యంత కీలకం. ఈ సమయంలో రోగికి సకాలంలో ఈ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే, గుండెలోని రక్తనాళాల్లో ఏర్పడిన రక్తం గడ్డకట్టడాన్ని (Clotting) నివారించి, రక్త ప్రసరణను తిరిగి పునరుద్ధరించవచ్చు. గుండెపోటుతో రోగిని ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి (Emergency) తీసుకురాగానే, వెంటనే ఈ ఇంజెక్షన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఈ విధానంలో, పెద్ద మెడికల్ కాలేజీలను హబ్‌లుగా (Hubs) ఏర్పాటు చేసి, జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను స్పోక్‌లుగా (Spokes) అనుసంధానం చేస్తున్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత, మెరుగైన, తదుపరి చికిత్స కోసం రోగిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు పంపించడం సులభమవుతుంది.

యూపీ ఆరోగ్య  వైద్య విద్య డైరెక్టర్ జనరల్ డా. రతన్‌పాల్ సుమన్ మాట్లాడుతూ, జిల్లా ఆసుపత్రులలో ఈ ఇంజెక్షన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రధాన వైద్యాధికారులకు (CMOs) ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ చర్య ద్వారా గుండెపోటు తర్వాత ఏర్పడే తీవ్రమైన పరిస్థితిని నివారించవచ్చని ఆయన అన్నారు.

 

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.