Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

సాక్షి లైఫ్ : పాత ఒకరోత.. కొత్త ఒక వింత అనే నానుడి అన్ని సందర్భాల్లో సూటవ్వకపోవచ్చు. అందుకేనేమో ఆ నానుడి పూర్తిగా రివర్స్ అయ్యింది. కొత్త ఒక రోత.. పాత ఒక వింతగా మారింది. నేటి డిజిటల్ యుగంలో పని ఒత్తిళ్లు, అనవసరపు ఆందోళనలతో మానసిక ఆరోగ్యం (Mental Health) తీవ్ర సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో మనసుకు శాంతిని, సమతుల్యతను (Inner Balance) తిరిగి ఇవ్వడానికి ఒక సాధారణ, శక్తివంతమైన మార్గాన్ని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదేమిటంటే..? పాత పుస్తకాలను మళ్లీ చదవడం (Revisiting Old Books) వల్ల మానసిక ప్రశాంతతను పొందవచ్చని వారు నిరూపిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Beat the Winter Blues : వింటర్ బ్లూస్ కు చెక్ పెట్టండి.. మానసిక ఉల్లాసాన్ని పెంచుకోండిలా..!

ఇది కూడా చదవండి..Hot Yoga : హాట్ యోగా ఎలాంటి వాళ్లు చేయకూడదు ఎందుకు..?

ఇది కూడా చదవండి..Acanthosis Nigricans : అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

పాత పుస్తకాలు, ముఖ్యంగా గతంలో మీకు బాగా నచ్చిన కథలు, నవలలు లేదా కవితా సంకలనాలు మళ్లీ చదవడం అనేది మానసిక ప్రశాంతతకు ఒక ఉత్తమమైన చికిత్సగా (Biblio-Therapy) పనిచేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

  పాత పుస్తకాలు మళ్లీ చదివితే కలిగే ప్రయోజనాలు.. 

ఒత్తిడిని తగ్గించడంలో (Stress Reduction).. 

 పుస్తకం చదవడం వల్ల ఒత్తిడి స్థాయిలు ఏకంగా 68 శాతం వరకు తగ్గుతాయని, పాత పుస్తకాన్ని తెరవగానే, దానిలోని పాత్రలు, కథాంశం అనేవి వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లి, ప్రస్తుత ఆందోళనల నుంచి దృష్టిని మళ్లిస్తాయని సస్సెక్స్ విశ్వవిద్యాలయం (University of Sussex) పరిశోధనలు చెబుతున్నాయి.

భద్రతా భావం (Sense of Security).. 

 చిన్నతనంలో లేదా సంతోషంగా ఉన్న రోజుల్లో చదివిన పుస్తకాలు, వాటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు రావడం వల్ల మెదడులో పాజిటివ్ హార్మోన్‌లు విడుదలవుతాయి. ఇది ఒక రకమైన భద్రత, సౌకర్యం (Comfort) అనే అంతర్గత భావనను కలిగిస్తుంది.

ఏకాగ్రత మెరుగు (Focus Restoration).. 

సోషల్ మీడియా, నోటిఫికేషన్ల వల్ల తగ్గుతున్న ఏకాగ్రతను పెంచడానికి పాత పుస్తకాలు అద్భుతంగా పనిచేస్తాయి. కథనంలో లీనమై చదవడం వలన మెదడుకు వ్యాయామం లభించి, (Mental health)మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ప్రశాంత నిద్ర (Better Sleep).. 

పడుకునే ముందు మొబైల్ స్క్రీన్ కాకుండా ప్రశాంతంగా పుస్తకం చదవడం వల్ల మనసు ప్రశాంతపడి, రక్తపోటు, హృదయ స్పందన రేటు కూడా తగ్గుతాయి. ఫలితంగా నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

కాబట్టి డిజిటల్ స్క్రీన్‌లకు కొంత విరామం ఇచ్చి, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు మీ పాత, ఇష్టమైన పుస్తకాలను మళ్లీ చదివేందుకు కేటాయించడం ద్వారా మానసిక ఆరోగ్యం, శరీరక ఆరోగ్యం చక్కగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..? 

ఇది కూడా చదవండి.. మానసిక సమస్యలకు పరిష్కారాలేంటి..?  

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health depression tensions mental-tensions stress mental-problems mental-issues research revisiting-old-books-mental-health books-for-stress-reduction biblio-therapy-benefits how-reading-old-books-helps-mental-health books-for-focus-restoration digital-detox-reading-books
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com