1690 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
సాక్షి లైఫ్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టివీవీపీ) ను త్వరలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా వెల్లడించారు. సంగారెడ్డిలోని తన నివాసంలో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టిజిజిడీ ) ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ కీలక విషయాలను ప్రకటించారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
డాక్టర్లకు పదోన్నతులు, హర్షం వ్యక్తం చేసిన సంఘం..
టీచింగ్ ఆసుపత్రులలో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి అన్నారు. పదోన్నతులు కల్పించినందుకు డాక్టర్ల సంఘం ప్రతినిధులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని డాక్టర్లందరూ హర్షం వ్యక్తం చేశారని సంఘం ప్రతినిధులు మంత్రికి వివరించారు.
కొత్త పోస్టుల భర్తీకి చర్యలు..
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న 1690 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (CAS) పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన విధివిధానాలను త్వరగా రూపొందించాలని తెలంగాణ మెడికల్ బోర్డును ఆయన ఆదేశించారు.
పదోన్నతుల్లో వయోపరిమితిపై నిబంధనలు..
నాన్-టీచింగ్ విభాగాలైన DME, DH, TVVPలలో టైం-బాండ్ ప్రమోషన్ల భర్తీలో వయోపరిమితి పెంపుపై ఉమ్మడి నిబంధనలు రూపొందించడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. డాక్టర్ల సంఘం ప్రతినిధులు చేసిన విజ్ఞప్తుల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ సమావేశంలో TGGDA అధ్యక్షులు డా. నరహరి, సెక్రటరీ జనరల్ డా. లాలు ప్రసాద్, డా. రాహుఫ్, డా. వినయ్ కుమార్, డా. గోపాల్, డా. క్రాంతి, డా. అశోక్, డా. రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను డాక్టర్ల సంఘం ప్రతినిధులు స్వాగతించారు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
