నాలుగురోజులపాటు వడగాల్పులు.. బీ ఎలెర్ట్..
సాక్షి లైఫ్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని ప్రకటించింది. వడగాలుల నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా మధ్యాహ్నం 11 నుంచి 4గంటల మధ్య ఎండలో బయటికి రాకుండా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలకు దూరంగా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది.
ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?
శిశువులు, చిన్నపిల్లలు..
ఎందుకంటే అవి ఎక్కువ శరీర ద్రవాలను కోల్పోవటానికి లేదా కడుపు తిమ్మిరికి కారణం కావచ్చు. శిశువులు, చిన్నపిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, మానసిక వ్యాధులు లేదా శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వడ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు..
వడగాలులు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మే 5 వరకు వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈరోజు రేపు ఈశాన్య రాష్ట్రలైన నాగలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి.. పలు రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్ జారీ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
