భారత్‌లో 7,121కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య..  

షేర్ చేయండి:
భారత్‌లో 7,121కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య..  

సాక్షి లైఫ్ : భారతదేశంలో కోవిడ్-19 రోజు రోజుకు విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఆరు మరణాలు సంభవించగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,121కి పెరిగింది. బుధవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 306 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 

మరణించిన ఆరుగురిలో ముగ్గురు కేరళ వారు కాగా, ఇద్దరు కర్ణాటక వారు, ఒకరు మహారాష్ట్ర వారు. మృతుల్లో ఒకరు 43 ఏళ్ల వయస్సు గల వ్యక్తి, ఆయన రోగనిరోధక శక్తి బలహీనపడినట్లు గుర్తించారు. మిగిలిన బాధితులు వృద్ధులు, శ్వాసకోశ, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

కొవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం వంటి కోవిడ్ ను సోకిన బాధితులకు దూరంగా ఉండాలని వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.   

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.