Cervical Cancer-Free Future : సర్వైకల్ క్యాన్సర్ రహిత భారత్ దిశగా అడుగులు.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడి..
సాక్షి లైఫ్ : మహిళల పాలిట శాపంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నిర్మూలనకు భారత్ దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ గెబ్రియేసస్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, సత్వర చికిత్స అనే త్రిముఖ వ్యూహంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. స్క్రీనింగ్‌లో రికార్డు.. జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు సుమారు 8.6 కోట్ల మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో సేవలు.. 30 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు 'విజువల్ ఇన్‌స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్' (VIA) పద్ధతిలో ఉచితంగా పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్.. ఫిబ్రవరి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన HPV వ్యాక్సినేషన్ ప్రచారాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత టీకా కార్యక్రమంగా WHO అభివర్ణించింది.
లక్ష్యం: 1.2 కోట్ల మంది బాలికలకు రక్షణ..
ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా 14 ఏళ్ల వయస్సు గల సుమారు 1.2 కోట్ల మంది కౌమార బాలికలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.90 రోజుల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది.
'గార్డాసిల్ క్వాడ్రివాలెంట్' టీకాను ఒకే డోసు పద్ధతిలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందమని, తల్లిదండ్రుల అనుమతితోనే టీకాలు వేస్తామని మంత్రి నడ్డా పేర్కొన్నారు. "స్వస్థ నారి సశక్త్ పరివార్" ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం అనే నినాదంతో మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని జేపి నడ్డా తెలిపారు.
WHO '90-70-90' లక్ష్యాల దిశగా..
2030 నాటికి గర్భాశయ క్యాన్సర్‌ను పారద్రోలాలన్న WHO లక్ష్యాలకు భారత్ మద్దతు తెలుపుతోంది. 90శాతం బాలికలకు పూర్తిస్థాయిలో టీకాలు అందించడం. 70శాతం మహిళలకు కనీసం రెండుసార్లు స్క్రీనింగ్ చేయడం. 90శాతం మంది బాధితులకు సరైన చికిత్స అందించడం. భారత్ తీసుకుంటున్న ఈ చర్యలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయని డబ్ల్యూ హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ కొనియాడారు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
