New Study : చిన్నారుల్లో క్యాన్సర్‌ పై సర్వే.. దేశంలోనే తొలిసారి..

షేర్ చేయండి:
New Study : చిన్నారుల్లో క్యాన్సర్‌ పై సర్వే.. దేశంలోనే తొలిసారి..

సాక్షి లైఫ్ : 'క్యాన్సర్' అనే మాట వింటేనే ఆ కుటుంబం కుప్ప కూలిపోతుంది. ముఖ్యంగా చిన్నారులకు ఈ వ్యాధి సోకితే తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. అయితే, ఆధునిక వైద్యం చిన్నారుల్లో క్యాన్సర్‌పై అద్భుత విజయాన్ని సాధిస్తోంది. క్యాన్సర్‌ను జయించిన 94.5 శాతం మంది బాలలు సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని ఎయిమ్స్ (AIIMS) నేతృత్వంలో జరిగిన దేశవ్యాప్త అధ్యయనం వెల్లడించింది.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

దేశంలోనే తొలిసారి.. భారీ సర్వే.. 

న్యూఢిల్లీలోని ఎయిమ్స్, రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు దేశవ్యాప్తంగా 20 కేంద్రాల్లో  సర్వే నిర్వహించారు. 18 ఏళ్ల లోపు క్యాన్సర్ బారిన పడి, చికిత్స తర్వాత కోలుకున్న 5,419 మంది చిన్నారుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. చికిత్స పూర్తయిన ఐదేళ్ల తర్వాత కూడా వీరిలో అత్యధికులు ఆరోగ్యంగా ఉండటం విశేషం.

గణాంకాల్లో ముఖ్యాంశాలు..

 బాధిత చిన్నారుల్లో 40.9 శాతం మంది 'అక్యూట్ ల్యుకేమియా' (రక్త క్యాన్సర్) బారిన పడినవారే. 94.7 శాతం మందికి కీమోథెరపీ ద్వారా, 30 శాతం మందికి సర్జరీ, 26.3 శాతం మందికి రేడియోథెరపీ ద్వారా చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స ముగిసిన తర్వాత 89.9 శాతం మంది పిల్లలు ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తున్నారు.

నిరంతర నిఘా అవసరం.. 

క్యాన్సర్‌ను జయించినప్పటికీ, భవిష్యత్తులో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చికిత్స పూర్తయిన కొన్నేళ్ల తర్వాత కూడా అప్పుడప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం (Follow-up) అవసరమని పరిశోధక బృందం సూచించింది. అయినప్పటికీ, 94.5 శాతం సర్వైవల్ రేటు నమోదు కావడం భారత్‌లో క్యాన్సర్ చికిత్స నాణ్యతకు నిదర్శనమని నిపుణులు కొనియాడుతున్నారు.

తల్లిదండ్రులకు భరోసా.. 

 ఒకప్పుడు క్యాన్సర్ అంటే మరణశాసనంగా భావించేవారు. కానీ ఇప్పుడు సరైన సమయంలో గుర్తిస్తే పిల్లలు మళ్లీ బడికి వెళ్లగలరు, ఆడుకోగలరు, అందరిలాగే గొప్ప భవిష్యత్తును పొందగలరని వైద్యులు ఈ నివేదిక ద్వారా భరోసా కల్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.