జూలై 6, 7 తేదీల‌లో హైదరాబాద్ లో దేశంలోనే అతిపెద్ద యూరాల‌జీ స‌ద‌స్సు  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : హెల్త్ హబ్ హైదరాబాద్ నగరం అతిపెద్ద ఆరోగ్య సదస్సుకు వేదిక కానుంది. యూరాల‌జీ, నెఫ్రాల‌జీ సేవ‌ల‌కు దేశంలోనే పేరెన్నిక‌గ‌న్న ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిష్ఠాత్మ‌క యూరాల‌జీ స‌ద‌స్సు రెండో ఎడిష‌న్ హైదరాబాద్ లో నిర్వ‌హిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏమిటి..? 

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

యూరేత్రా @ ఏఐఎన్‌యూ పేరుతో నిర్వ‌హిస్తున్న ఈ స‌ద‌స్సు దేశంలో యూరాల‌జీ రంగంలో ఒక ప్ర‌ధాన మైలురాయి. జూలై 6, 7 తేదీల‌లో జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ అండ్ ట్రేడ్ ఫెయిర్స్ ప్రాంగ‌ణంలో నిర్వ‌హిస్తున్న ఈ స‌ద‌స్సుకు యూకే, మెక్సికో, గ‌ల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్‌, ఆగ్నేయాసియా దేశాల‌తో స‌హా.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా యూరాల‌జిస్టులు హాజ‌ర‌వుతున్నారు. మ‌ల్లిక్ రాజు పూర్ణ యూరోకేర్ ఫౌండేష‌న్ ఈ కార్య‌క్ర‌మానికి స‌హ నిర్వాహ‌కులుగా ఉన్నారు.

అతిపెద్ద స‌ద‌స్సు.. 

యూరాల‌జిస్టుల‌కు దేశంలోనే అతిపెద్ద స‌ద‌స్సు అయిన ఇక్క‌డ‌.. 24 లైవ్ స‌ర్జ‌రీలు ప్ర‌ద‌ర్శిస్తారు. మూత్ర‌నాళ పున‌ర్నిర్మాణాల‌లో కొత్త టెక్నిక్‌లు ఇక్క‌డ నేర్పిస్తారు. ఈ శ‌స్త్రచికిత్స‌ల్లో సంక్లిష్ట అంశాలు, మూత్ర‌నాళం స‌న్న‌బ‌డిన‌ప్పుడు పిల్ల‌లు, పురుషులు, మ‌హిళ‌ల్లో ఎలా చేయాల‌నేవాటిని చూపిస్తారు. జ‌న్యుప‌ర‌మైన ఇంజినీరింగ్ చేసిన సామాగ్రి, రీజ‌న‌రేటివ్ మెడిసిన్‌లో సెల్ థెర‌పీ లాంటి అత్యాధునిక ప‌ద్ధ‌తుల గురించి కూడా చ‌ర్చిస్తారు. పుణెకు చెందిన డాక్ట‌ర్  సంజ‌య్ కుల‌క‌ర్ణి, కోయంబ‌త్తూరుకు చెందిన డాక్ట‌ర్ గ‌ణేశ్ గోపాల‌కృష్ణ‌న్  లాంటి యూరాల‌జీ దిగ్గ‌జాలతో పాటు ఐఎస్‌బీ హైద‌రాబాద్ మాజీ డీన్ అజిత్ రంగ్నేక‌ర్ ఈ స‌ద‌స్సులో కీల‌క‌ప్ర‌సంగాలు చేస్తారు.

యూరాల‌జిస్టులు.. 

ఈ సంద‌ర్భంగా ఏఐఎన్‌యూకు చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్టు, ఆండ్రాల‌జిస్టు డాక్ట‌ర్ భ‌వ‌తేజ్ ఎన్‌గంటి మాట్లాడుతూ, "మూత్ర‌నాళ పున‌ర్నిర్మాణ శ‌స్త్రచికిత్స‌లు చాలా సంక్లిష్టం. వీటిలో వైఫల్యాలు కూడా ఎక్కువే. అందువ‌ల్ల బాగా శిక్ష‌ణ పొందిన‌, నైపుణ్యం ఉన్న యూరాల‌జిస్టుల అవ‌స‌రం బాగా ఎక్కువ‌. యూరాల‌జిస్టులు అంద‌రికీ విజ్ఞానం పంచ‌డం, త‌ద్వారా రోగుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డం మా స‌ద‌స్సు ప్ర‌ధాన ల‌క్ష్యం” అని వివ‌రించారు.

ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.