International Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం ఏమేం చేయాలి..?
సాక్షి లైఫ్ : ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆమెలేని జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. పేగును తెచ్చుకొని పుట్టిన ప్రతి ఒక్కరికీ తమ మాతృమూర్తులను ఆరోగ్యం సంరక్షణలోనూ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నప్పుడు మనల్ని లాలించి,పాలించి, అందంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దిన ఆ తల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అందుకోసమే తల్లి ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.. రేపు మదర్స్ డే సందర్భంగా అమ్మ ఆరోగ్యంపై సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం.. మీ కోసం..
ఇది కూడా చదవండి.. కార్బైడ్ తో పండిన పుచ్చకాయను తెలుసుకోవచ్చు ఇలా..
అంతర్జాతీయ మాతృ దినోత్సవం..
ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం, ప్రజలు అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 12, 2024 ఆదివారం నాడు, ప్రేమ, అభిమానం, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడం ద్వారా తల్లులను, వారి అద్భుతమైన త్యాగాలను గౌరవించే ఒక ముఖ్యమైన రోజుగా ఇంటర్నేషనల్ మదర్స్ డే ని జరుపుతారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అందరూ తమ తల్లులకు రకరకాల బహుమతులు ఇస్తారు. ఈసారి మీరు మీ అమ్మకు ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వవచ్చు. మదర్స్ డే నాడు మీ తల్లికి ఆరోగ్య బహుమతిని అందించండి, ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ ముఖ్యమైన రక్త పరీక్షలను క్రమం తప్పకుండా చేయించండి.
ముఖ్యమైన రక్త పరీక్షలు..
ప్రతి తల్లి తన కుటుంబంలోని ప్రతి సభ్యుడిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంటి పనులు, రోజువారీ జీవితంలోపడి తన ఆరోగ్యాన్ని విస్మరిస్తుంది. ప్రస్తుతం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రోగాల బారిన పడుతున్న మహిళలు ఎందరో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మీ తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికి, ఆమెకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి మదర్స్ డే ఒక గొప్ప అవకాశం.
ఇది కూడా చదవండి.. చక్కెర ఎందుకు ప్రమాదమంటే..?
ప్రతి సంవత్సరం మీరు మదర్స్ డే రోజున మీ తల్లికి అనేక బహుమతులు ఇస్తున్నప్పటికీ, ఈసారి మీరు కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షలు చేయించడం ద్వారా ఆమెకు ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు. 40 నుంచి 50 ఏళ్ళు పైబడిన మహిళలు విటమిన్ డీ, విటమిన్ సి టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
