సాక్షి లైఫ్ : సరికొత్త పరిశోధనల ద్వారా ప్రకృతికి సమానంగా ప్రతి సృష్టి చేయాలనే మనిషితపన మంచిదే అయినా కొన్ని విషయాలలో అనర్థాలు తలెత్తుతున్నాయి. అటువంటివాటిలో ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ విశేషాలు ఏంటో ఓసారి చూద్దాం..
ఇది కూడా చదవండి.. మానసిక సమస్యలకు ఇవి కూడా కారణమేనా..?
పంచదార తీసుకోవడం వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. ఈ కారణంగా చాలా మంది బరువు తగ్గేందుకు తక్కువ క్యాలరీలు ఉండే ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ ను వాడుతుంటారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ షుగర్‌తో మంచి కంటే చెడే ఎక్కువ ఉన్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు. ఆహార పదార్థాల్లో వినియోగించే ఆస్పర్టేమ్, శాకరైన్, సుక్రలోజ్, నియోటేమ్ వంటి కృత్రిమ చక్కెరలతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
కృత్రిమ చక్కెర వాడితే..
సహజ చక్కెరకు బదులు కృత్రిమ చక్కెర వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం 13 శాతం పెరుగుతుందని వెల్లడైంది. పారిస్‌లోని ఫ్రెంచ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్, మెడికల్ రిసెర్చ్, సార్బొన్నె పారిస్ నోర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇలాంటి చక్కెరలతో బ్రెస్ట్ క్యాన్సర్, ఊబకాయానికి సంబంధించిన క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చ రించారు.
క్యాన్సర్ వచ్చే ప్రమాదం..
ఫ్రాన్స్‌లో లక్షమందికిపైగా దీనిపై అధ్యయనం చేశారు. వీరందరి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య వివరాలను తీసుకు న్నారు. ఆ తర్వాత క్యాన్సర్ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. అధిక మోతాదులో కృత్రిమ చక్కెరలు ముఖ్యంగా ఆస్పర్టేమ్, ఏస్‌సల్ఫేమ్-కె తీసుకున్న వారిలో ఎక్కువ శాతం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. సాధారణంగా కృత్రిమ చక్కెరలు సాధారణ చక్కెరతో పోలిస్తే తక్కువ క్యాలరీలను, ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి.
సాఫ్ట్ డ్రింక్స్..
తయారీదారులు అందుకే వీటిని చాలా ఆహారపదార్థాల్లో వినియోగిస్తారు. సుక్రలోజ్ అనే కృత్రిమ చక్కెర సాధారణ చక్కెరతో పోలిస్తే 600 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్‌లు, బేకరీ పదార్థాలు, క్యాండీలు, చాక్లెట్లు, జామ్‌లు, జెల్లీలు, పొడితో తయారుచేసిన ద్రవాల్లో ఈ చక్కెరలు వాడుతారు.
అనర్థాలే ఎక్కువ..
ఎక్కువగా మధుమేహంతో బాధపడే వారు ఈ రకం చక్కెరలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజ నాలకంటే అనర్థాలే ఎక్కువని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రకృతిలో మనకు సహజ సిద్ధంగా లభించేవి ఏవైనా సరే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి కృత్రిమ ఉత్పత్తులతో పోలిస్తే న్యాచురల్ గా లభించే ఉత్పత్తులే మంచిదని చెబుతున్నారు పరిశోధకులు.