దేశంలోనే తొలి యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్‌గా కక్కోడి పంచాయతీ కుటుంబ ఆరోగ్య కేంద్రం

షేర్ చేయండి:
దేశంలోనే తొలి యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్‌గా కక్కోడి పంచాయతీ కుటుంబ ఆరోగ్య కేంద్రం

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగం, దుర్వినియోగాన్ని అరికట్టాలని హెచ్చరికలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వీటి వాడకం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. కొయ్యూరు కక్కోడి పంచాయతీలోని కుటుంబ ఆరోగ్య కేంద్రం దేశంలోనే తొలి యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్‌గా నిలిచి కేరళ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ఈ విజయం పంచాయతీ ప్రత్యేక ప్రణాళికలతోపాటు ప్రజల్లో యాంటీ బయాటిక్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను గురించి అవగాహన కల్పించడం ద్వారా సాధ్యమైంది. 

శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

ఈ ఉద్యమంలో..
 
కోజికోడ్‌లోని కక్కోడి పంచాయతీ ఈ ఉద్యమంలో యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగానికి వ్యతిరేకంగా ప్రత్యేకమైన ప్రణాళికలను రూపొందించడంతోపాటు అమలు చేయడం ద్వారా విజయం సాధించి ఆదర్శంగా నిలిచింది. కుటుంబశ్రీ, హరిత కర్మ సేన, పంచాయతీ పరిధిలోని వివిధ రైతుల వంటి వివిధ శాఖలను సమన్వయంతో చేసిన సమిష్టి కృషి ఫలితంగా కాకోడి పంచాయతీ కుటుంబ ఆరోగ్య కేంద్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఇది దేశంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్ గా గుర్తింపు పొందింది.

యాంటీబయాటిక్ లెటరసీ ఆర్డర్..

రాష్ట్రంలో యాంటీబయాటిక్ లెటరసీ ఆర్డర్ అమలులోకి రాకముందే పంచాయతీ తన సొంత ప్రణాళికలను రూపొందించుకోగలిగింది. ప్రైవేట్ ఫార్మసీల ద్వారా పంపిణీ చేసే మందుల సమాచారాన్ని సేకరించి పంచాయతీలో ప్రత్యేక కవరులో యాంటీబయాటిక్స్ అందజేసేవారు. కక్కోడి పంచాయతీనే యాంటీ బయోటిక్ స్మార్ట్ విలేజ్ గా మార్చేందుకు పంచాయతీ అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఇందుకోసం వినూత్న ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.   

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.